Home > Movies - Press Releases
వైశాఖం పాటలు అదుర్స్ - వినాయక్

ఒక చిన్న సినిమా టీజర్‌కి 2.5 మిలియన్‌ వ్యూస్‌ రావడమనేది మామూలు విషయం కాదు. 'వైశాఖం' అనే మంచి తెలుగు టైటిల్‌తో డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ పతాకంపై బి.ఎ.రాజు నిర్మించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయనే దానికి యూ ట్యూబ్‌లో వచ్చిన వ్యూసే నిదర్శనం. హరీష్‌, అవంతిక జంటగా రూపొందిన ఈ చిత్రానికి డి.జె.వసంత్‌ సంగీతాన్నందించారు. 

ఈ చిత్రానికి సంబంధించి మరో కొత్త టీజర్‌ను ముఖ్య అతిథిగా విచ్చేసిన సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ మాట్లాడుతూ - ''ఇది శ్రీమతి జయగారికి ఎనిమిదో సినిమా. ఎనిమిది సినిమాలు డైరెక్ట్‌ చెయ్యడమంటే తమాషా కాదు. లేడీ డైరెక్టర్‌గా విజయనిర్మలగారి తర్వాత అన్ని సినిమాలు డైరెక్ట్‌ చేసిన ఘనత మన తెలుగు ఇండస్ట్రీలో జయగారికే దక్కుతుంది.

ఇప్పటివరకు జయగారు డైరెక్ట్‌ చేసిన సినిమాలు పెద్ద హిట్స్‌ అయ్యాయి, ఏవరేజ్‌ సినిమాలు అయ్యాయి. అయితే ఆ సినిమాల వల్ల ఎవరికీ ఒక్క రూపాయి కూడా పోలేదు. కొనుక్కున్న వాళ్ళకి, తీసిన వాళ్ళకి ఎవరికీ నష్టం రాలేదు. అందరికీ హ్యాపీగా డబ్బులొచ్చే సినిమాలే తీశారు. జయగారు తీసే సినిమాల్లో హీరో, హీరోయిన్‌ కొత్తవాళ్ళు అవ్వడం వల్ల చిన్న సినిమా అనిపిస్తుందేమోగానీ, ఖర్చు విషయంలో మాత్రం ఎక్కడా వెనకాడరు.

చాలా బాగా ఖర్చు పెడతారు. ఇది చిన్న సినిమా కాదు. చాలా పెద్ద సినిమా. పాటలన్నీ చాలా లావిష్‌గా తీశారు. జయగారు తీసిన 'లవ్‌లీ' పెద్ద హిట్‌ అయింది. దానికంటే 'వైశాఖం' ఇంకా పెద్ద హిట్‌ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అన్నారు. 

సంగీత దర్శకుడు డి.జె.వసంత్‌ మాట్లాడుతూ - ''ఈ సినిమాకి మ్యూజిక్‌ చేసేటపు ఎంతో ఎంజాయ్‌ చేస్తూ చేశాం. సినిమా ఔట్‌పుట్‌ చూసి ఇంకా బాగా ఎంజాయ్‌ చేస్తున్నాం. సినిమాటోగ్రాఫర్‌ వాలిశెట్టి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ - ''ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన వినాయక్‌గారికి కృతజ్ఞతలు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. అందరూ సినిమాని ఎంజాయ్‌ చేస్తారు.తప్పకుండా ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవుతుంది'' అన్నారు. 

డైరెక్టర్‌ జయ బి. మాట్లాడుతూ - ''ఈ ఫంక్షన్‌కి విచ్చేసిన వినాయక్‌గారికి థాంక్స్‌. ఒక చిన్న సినిమా టీజర్‌ వారం రోజుల్లో 2.5 మిలియన్‌ వ్యూయర్స్‌ని ఆకట్టుకుందంటే మామూలు విషయం కాదు. అంత మంది సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారని తెలుస్తోంది. డెఫినెట్‌గా వాళ్ళందరికీ సినిమా నచ్చుతుంది'' అన్నారు. 

నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ - ''వినాయక్‌గారు ఎంతో బిజీగా వున్నప్పటికీ మా ఫంక్షన్‌ విచ్చేసి మమ్మల్ని బ్లెస్‌ చేసినందుకు చాలా థాంక్స్‌. మా 'వైశాఖం' చిత్రం థీమ్‌ టీజర్‌కి ఒక్క వారంలోనే 2.5 మిలియన్‌ వ్యూస్‌ వచ్చినందుకు మేమంతా ఎంతో హ్యాపీగా వున్నాం. 'వైశాఖం' లవ్ లీ కన్నా రెట్టింపు విజయాన్ని సాధిస్తుందని ఎంతో కాన్ఫిడెంట్‌గా వున్నాము'' అన్నారు. హీరో హరీష్‌, నటుడు పృద్వీ, తదితరులు ప్రసంగించారు.