Advertisement


Home > Movies - Press Releases
వారణాసిలో బెల్లంకొండ ఫైట్లు

పీటర్ హెయిన్స్ ను ఫైట్ మాస్టర్ గా తీసుకున్నారటేనే అర్థం అయిపోతుంది. సినిమాలో ఫైట్స్ కీలకంగా వుండాలని డైరక్టర్ ఫిక్స్ అయ్యారని. బెల్లంకొండ శ్రీనివాస్ - శ్రీవాస్ కాంబినేషన్ లో ఓ మాంచి ఎమోషనల్ మూవీ షూటింగ్ ఫాస్ట్ గా జరుగుతొంది. ఇప్పటికే హైదరాబాద్, పోలాచ్చిల్లో రెండు షెడ్యూళ్లు ఫినిష్ చేసుకున్న ఈ సినిమా యూనిట్ ఇప్పుడు వారణాసికి చేరుకుంది. అక్కడ కొన్ని కీలక ఫైటింగ్ ఎపిసోడ్ లు చిత్రీకరిస్తున్నారు. 

ఇంజినీరింగ్ కాలేజీ స్టూడెంట్ గా హీరో కనిపించే ఈ సినిమాలో కాస్త టెక్నాలజీ బ్యాకగ్రవుండ్ కూడా వుంటుంది. అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ సినిమాలో నాలుగైదు ఫైట్లు వుంటాయట. అన్నీ పీటర్ హెయిన్స్ కే అప్పగించడం విశేషం. ఒక్కో ఫైట్ ను ఒక్కో డిఫరెంట్ స్టయిల్ లో డిజైన్ చేసాడట అతగాడు. ఆ ప్లాన్ ప్రకారం వారణాసిలో ఓ ఫైట్ ను ఇప్పటికే ఫినిష్ చేసారు. అదే ఫైట్ కు సంబంధించిన చిన్న బ్యాలెన్స్ వర్క్ ను హైదరాబాద్ లో ఫినిష్ చేస్తారట. 

బెల్లకొండ శ్రీనివాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోందీ సినిమాలో. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందింస్తున్నారు. బుర్రా సాయి మాధవ్ మాటలు సమకూర్చుతున్నారు.