Home > Movies - Press Releases
`వీడెవ‌డు` టీజ‌ర్ విడుద‌ల‌

మౌన‌మేల‌నోయి, ఓరేయ్‌..పండు, నీ జ‌త‌గా నేనుండాలి సినిమాల‌తో తెలుగు ప్రేక్షకుల‌కు సుప‌రిచితుడైన స‌చిన్‌జోషి హీరోగా తాతినేని స‌త్య ద‌ర్శక‌త్వంలో చేస్తోన్న స‌స్పెన్స్ క్రైం థ్రిల్లర్ `వీడెవ‌డు`. ప్రొ క‌బ‌డ్డీ ప్లేయ‌ర్ అయిన హీరో, ఫ్యాన్‌గా ప‌రిచ‌య‌మైన హీరోయిన్‌తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. కానీ అప్పటికే కొంత‌మంది హీరోయిన్‌ను చంప‌డానికి ప్ర‌య‌త్నం చేస్తుంటారు. అది తెలుసుకున్న హీరో త‌న ల‌వ‌ర్‌ను కాపాడుకోవ‌డానికి ఏం చేశాడు?  హీరో చేసిన రిస్క్ ఎంట‌నేదే ఈ క‌థ‌. ఈ సినిమాను త‌మిళంలో `యారివ‌న్` అనే పేరుతో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా టీజ‌ర్‌ను సోమ‌వారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో విడుద‌ల చేశారు. 

ఎస్‌.ఎం.ఎస్‌, భీమిలి క‌బ‌డ్డీ జట్టు, శంక‌ర సినిమాలు అన్నీ రీమేక్ చిత్రాలే. నేను తెలుగులో చేసిన స్ట్రయిట్ మూవీ వీడెవ‌డు.బినేంద్ర మీన‌న్ సినిమాటోగ్రఫీ, థ‌మ‌న్ మ్యూజిక్‌, ర‌ఘు కుల‌క‌ర్ణి ఆర్ట్‌, స‌హా అంద‌రూ ఎంతో స‌పోర్ట్ చేశారు. క‌న‌ల్‌క‌ణ్ణన్‌గారి ఫైట్స్ హైలైట్‌గా అనిపిస్తాయి. స‌చిన్ జోషిగారు ఎక్స‌లెంట్‌గా న‌టించారు. అన్నీ కార్యక్రమాల‌ను పూర్తి చేసి సినిమాను మే నెలాఖ‌రున విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాం అని ద‌ర్శ‌కుడు తాతినేని స‌త్య తెలిపారు.
వీడెవ‌డు సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వ‌చ్చింది. సినిమా కోసం ప‌నిచేసిన వారంద‌రూ ప్యాష‌న్‌తో వ‌ర్క్ చేశారు. టీజ‌ర్ అంద‌రికీ న‌చ్చింది. అలాగే సినిమా కూడా అంద‌రికీ న‌చ్చేలా ఉంటుందని హీరో స‌చిన్ జోషి అన్నారు.

టీజ‌ర్ చాలా బావుంది. సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆస‌క్తిని రేకెతిస్తుంది. స‌చిన్‌గారు ఎంతో న‌ట‌న‌ను క‌న‌ప‌రిచారు. ద‌ర్శకుడు స‌త్య సినిమాను తెర‌కెక్కించిన తీరు ఆస‌క్తిని క‌లిగిస్తుంది. సినిమా మంచి విజ‌యాన్ని సాధించాల‌ని ఎంటైర్ టీంకు అభినంద‌న‌లు అని ద‌ర్శకుడు ర‌వీంద్ర అన్నారు. 
``నేను బేసిక్‌గా డాక్టర్ అయినా, మల‌యాళంలో ప‌లు చిత్రాల్లో న‌టించాను. వీడెవడు చిత్రంలో కూడా ఓ కీల‌క పాత్రలో న‌టించాను. అద్భుత‌మైన క‌థ‌. వండ‌ర్‌ఫుల్ ఎగ్జిక్యూష‌న్‌. స‌చిన్ అమేజింగ్ పెర్‌ఫార్మెన్స్ చేశారు. సీట్ ఎడ్జ్ మూవీలా ద‌ర్శకుడు స‌త్య సినిమాను తెర‌కెక్కించారని సాజి డిసౌజా తెలిపారు. 
స‌చిన్‌, ఇషా గుప్తా, ప్రభు, కిషోర్‌, సుప్రీత్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి, వెన్నెల‌కిషోర్‌, హ‌ర్షవ‌ర్ధన్‌, ధ‌న్య బాల‌కృష్ణన్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః బినేంద్ర మీన‌న్‌, సంగీతంః ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్‌, ఎడిటింగ్ః ప్రవీణ్ పూడి, ఆర్ట్ః ర‌ఘుకుల‌క‌ర్ణి, ఫైట్స్, క‌న‌ల్ క‌ణ్ణన్‌, పాట‌లుః రామ‌జోగ‌య్యశాస్త్రి, భాస్కర‌భ‌ట్ల, శ్రీమ‌ణి, కొరియోగ్రఫీః సీజ‌ర్‌, జానీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః శివ‌ప్రసాద్ గుడిమిట్ల‌, ప్రొడ్యూస‌ర్ః రైనా జోషి, క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శక‌త్వంః తాతినేని స‌త్య.