Advertisement


Home > Movies - Press Releases
'యమన్‌' తో తెలుగు చాన్స్ లు...మియాజార్జ్‌

అందం, అభినయం ఉన్న నటి మియాజార్జ్‌. మలయాళం, తమిళ భాషల్లో 20 చిత్రాలకు పైగా హీరోయిన్‌గా నటించి అనతి కాలంలోనే మంచి పర్ఫార్మర్‌గా పేరు తెచ్చుకున్న మియాజార్జ్‌ ప్రస్తుతం సునీల్‌ సరసన 'ఉంగరాల రాంబాబు' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఆ చిత్రం షూటింగ్‌ దశలో ఉంది. కాగా విజయ్‌ ఆంటోని హీరోగా జీవశంకర్‌ దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి రూపొందిస్తున్న 'యమన్‌' చిత్రంలో మియాజార్జ్‌ హీరోయిన్‌గా నటించింది.  ఈ చిత్రం రిలీజ్‌ సందర్భంగా హీరోయిన్‌ మియాజార్జ్‌తో మీడియాతో మాట్లాడింది

నేపథ్యం

- కేరళలోని కొట్టాయం సమీపంలో పాల స్వగ్రామం మాది. మలయాళ, తమిళ భాషల్లో 20 చిత్రాల్లో నటించాను. 

యమన్ గురించి

- ఇట్స్‌ ఎ పొలిటికల్‌ ధ్రిల్లర్‌ మూవీ. పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఇదివరకు చాలా చిత్రాలు వచ్చాయి. కానీ వాటన్నింటికంటే ఈ చిత్రం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. హీరో క్యారెక్టరైజేషన్‌ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అందరికీ పనిష్‌మెంట్‌ ఇచ్చే ఎలిమెంట్‌ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సీన్‌ తర్వాత నెక్ట్స్‌ సీన్‌ ఏం వస్తుంది అనే క్యూరియాసిటీ ఆడియన్‌లో కలుగుతుంది. అంత ఇంట్రెస్టింగ్‌గా ఈ చిత్రం ఉంటుంది. 

క్యారెక్టర్ ఏంటీ?

- ఈ చిత్రంలో హీరోయిన్‌ పాత్ర చేశాను. నా క్యారెక్టర్‌ పేరు అంజన. సినిమాల్లో నటిస్తూ సాధారణ జీవితం గడిపే అమ్మాయి. వెరీ టిపికల్‌ గర్ల్‌. 

విజయ్‌ ఆంటోనితో ? 

- వెరీ నైస్‌ పర్సన్‌ విజయ్‌ ఆంటోని. మ్యూజిక్‌ డైరెక్టర్‌, సౌండ్‌ ఇంజనీర్‌, హీరో. హి ఈజ్‌ ఎ మల్టీ టాలెంటెడ్‌ పర్సన్‌. మంచి కథలు ఎంపిక చేసుకుంటూ హీరోగా వరుస సక్సెస్‌లు సాధిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. 

'ఉంగరాల రాంబాబు'? 

- క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ మూవీ. సెంటిమెంట్‌, కామెడీ అన్ని ఎలిమెంట్స్‌ ఈ చిత్రంలో ఉన్నాయి. 

నెక్ట్స్‌ మూవీస్‌? 

- డిస్కషన్స్‌ జరుగుతున్నాయి. ఇంకా ఏదీ ఫైనల్‌ కాలేదు.