Home > Movies - Press Releases
'యుద్దం' ఆకట్టుకుంటుంది

తొలిసారి పూర్తిగా కుర్రళ్లతో కలిసి, కొత్త టీమ్ తో, కొత్త ఆలోచనలతో తెరకెక్కించిన సినిమా యుద్ధం శరణం  అని నిర్మాత సాయి కొర్రపాటి అన్నారు. ఆయన తన వారాహి చలన చిత్ర పతాకంపై నిర్మించిన యుద్ధం శరణం సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాగ్ చైతన్య-లావణ్య త్రిపాఠీ కాంబినేషన్ లో కృష్ణ అనే యంగ్, న్యూ, టాలెంటెడ్ డైరక్టర్ తో ఈ సినిమా రూపొందించామన్నారు. 

సినిమా సెన్సార్ చూసిన సభ్యులు చాలా ఎగ్జయిటింగ్ ఫీలయ్యారని, వాళ్లకు తొలిసగంలో నడచిన అందమైన ఫ్యామిలీ డ్రామా, చైతూ-లావణ్యల లవ్ సీన్లు బాగా నచ్చాయని సాయి కొర్రపాటి చెప్పారు. సినిమా తొలిసగం ప్యామిలీలను ఆకట్టుకుంటే, మలిసగం శ్రీకాంత్-చైతూల మధ్య నడిచే మైండ్ గేమ్ తో, యూత్ ను ఆకట్టుకుంటుందని అన్నారు. క్లయిమాక్స్ ఉత్కంఠగా వుంటుందన్నారు.

ఇప్పటిదాకా రకరకాల సినిమాలు నిర్మించానని, ఈ తరహా జోనర్, ఈ తరహా టీమ్ తో సినిమా చేయడం ఇదే ప్రథమం అని సాయి కొర్రపాటి వివరించారు. ఇటీవల విడుదలయిన పాటలకు మంచి ఆదరణ లభిస్తోందని, సినిమా విడుదలయిన తరువాత విజువల్స్ తో కలిసి మంచి అడియోగా మారుతుందని ఆయన చెప్పారు.