Advertisement

Advertisement


Home > Movies - Reviews

27 వచ్చాకే పెళ్లి..రాజ్ తరుణ్

27 వచ్చాకే పెళ్లి..రాజ్ తరుణ్

మూడు బ్యాక్ టు బ్యాక్ హిట్ లతో ముందుకు దూసుకెళ్తున్నాడు హీరో రాజ్ తరుణ్. నాలుగో సినిమా 'సీతమ్మ అందాలు..రామయ్య సిత్రాలు'..అంటూ గవిరెడ్డి శ్రీనివాస్ దర్శకత్వంలో రేపు విడుదల కాబోతోంది. సినిమా సినిమాకు టెన్షన్ పెరుగుతోంది తప్ప తగ్గడం లేదన్న రాజ్ తరుణ్ తో చిట్ చాట్

మూడు బ్యాక్ టు బ్యాక్ హిట్ లతో ముందుకు దూసుకెళ్తున్నాడు హీరో రాజ్ తరుణ్. నాలుగో సినిమా 'సీతమ్మ అందాలు..రామయ్య సిత్రాలు'..అంటూ గవిరెడ్డి శ్రీనివాస్ దర్శకత్వంలో రేపు విడుదల కాబోతోంది. సినిమా సినిమాకు టెన్షన్ పెరుగుతోంది తప్ప తగ్గడం లేదన్న రాజ్ తరుణ్ తో చిట్ చాట్

కాలక్షేపం సినిమా

సీతమ్మ అందాలు..రామయ్య సిత్రాలు..అలా అలా కాలక్షేపం అయిపోయే సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా, ఫన్, పంచ్ లతో సరదా సరదాగా సాగిపోతుంది. సెకండాఫ్ కథ గుండెలకు హద్దుకుంటుంది. బేసిక్ గా నా ఇంతకు ముందు సినిమాల్లాగే, ప్రతి కుర్రాడు వాళ్లను పాత్రలో ఐడెంటిఫై చేసుకునేలా వుంటుంది.

ఎంపికలో మొహమాటం లేదు

కథల ఎంపికలో అస్సలు మొహమాటం పడడం లేదు. కొన్నాళ్ల పాటు ఇండస్ట్రీలో వుండాలని, కొన్ని సినిమాలు చేయాలని వుంది. అందుకే, వచ్చిన ప్రతి ఆఫర్ అంగీకరించేయడం లేదు. కథ నచ్చాలి..కథకే మొదటి ప్రాధాన్యత. ఆ దిశగానే వెళ్తున్నాను. అవసరమైతే ఆర్నెల్లు ఖాళీగా కూర్చోవడానికి కూడా రెడీగానే వున్నాను. 

మూడు ప్రాజెక్టులు

ప్రస్తుతం మూడు ప్రాజెక్టులు సైన్ చేసాను. మంచు విష్ణుతో మల్టీస్టారర్ పోగ్రెస్ లో వుంది. గీతా ఆర్ట్స్ పతాకంపై అరవింద్ గారు నిర్మించే సినిమా తరువాతది. ఆ తరువాత దిల్ రాజు గారు నిర్మించే సినిమా వుంటుంది. ఇంక మరే సినిమా ఓకె చేయలేదు. కథలు వింటున్నానంతే.

ఇరవై ఏడు వచ్చాకే.

ఇప్పుడు నా వయస్సు 23. నేను ఎప్పుడో డిసైడ్ చేసుకున్నాను. 27 వచ్చాకే పెళ్లి చేసుకోవాలని. నా లక్కీ నెంబర్ కూడా 9. అందుకే 27 వచ్చాకే చేసుకుంటాను. 

ఫిక్సయి లేను

ఇలాంటి సినిమానే చేయాలి. ఫలాన జోనర్ లోనే చేయాలి అని ఏమీ లేదు. సబ్జెక్ట్ బాగుంటే చేసేస్తానంతే. బ్యానర్, డైరక్టర్ ఇవేవీ కాదు ముఖ్యం. సబ్జెక్ట్ అంతే. అది బాగుంటే ఎన్ని అభ్యంతరాలున్నా చేస్తాను.

టెన్షన్

మూడు హిట్ లు కొట్టావ్ కదా ఇంకా టెన్షన్ ఎందుకు అంటారు అంతా. కానీ నాకు ప్రతి సినిమాకు మొదటి సినిమా అంత టెన్షన్ వుంటుంది. అయితే సీతమ్మ అందాలు సినిమా చూసేసాను. బాగుంది ప్రేక్షకులకు నచ్చుతుంది అని తెలిసిపోయింది కాబట్టి..ఇప్పుడు టెన్షన్ లేదు

అంతా అబద్ధం

నేను పారితోషికం పెంచేసానని ఎవరైనా అంటే అది అబద్ధమే. నేను ఇప్పుడు చేస్తున్న మూడు ప్రాజెక్టులు కూడా ఎప్పుడో ఒప్పుకున్నవి. మరి పారితోషికం పెంచే సమస్య ఎక్కడుంది. ఇకపై ఒప్పుకుంటే..ఏమో చెప్పలేను.

ఖాళీగా వుంటే

ఖాళీ సమయం దొరికితే నేను ఇంటికే పరిమితం అవుతాను. అంతకన్నా వేరే ఏవగేషన్ లు ఏమీ లేవు. జస్ట్ ఇంట్లో వుండి..నాకు ఇష్టమైన నా డాగ్స్ తో ఆడుకుంటా అంతే.

విఎస్ఎన్ మూర్తి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?