Advertisement

Advertisement


Home > Movies -

ఈవారం ట్రేడ్‌ టాక్‌

ఈవారం ట్రేడ్‌ టాక్‌

'గురు' చిత్రం మన ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. రొటీన్‌కి భిన్నంగా సాగే ఈ బాక్సింగ్‌ డ్రామాకి అభిరుచి గల ప్రేక్షకులు కనక్ట్‌ అయ్యారు. లో బడ్జెట్‌లో తీసిన ఈ చిత్రం తొలి వారంలోనే పెట్టుబడిని వెనక్కి రాబట్టుకుంది. ప్రస్తుతం గుర్తించదగ్గ షేర్స్‌ రాబట్టుకుంటోన్న సినిమా అంటూ మార్కెట్లో వుంటే అది గురు ఒక్కటే. 

'కాటమరాయుడు' వైభవం ఒక్క వారంతో ముగిసింది. సెకండ్‌ వీకెండ్‌లో పుంజుకుంటుందనే బయ్యర్ల ఆశలు పటాపంచలయ్యాయి. మూడోవంతు నష్టాలు తప్పవని తేలిపోవడంతో బయ్యర్లు మరోసారి సాయం కోసం పవన్‌కేసి చూసే పరిస్థితి వచ్చింది. ఫ్లాప్‌ టాక్‌ వచ్చినప్పటికీ తన స్టార్‌డమ్‌తో అరవై కోట్లు దాటించిన పవన్‌ కథ మీద కాస్త దృష్టి పెడితే ఇలాంటి పరాజయాలు వుండవు. 

పూరిజగన్నాథ్‌ 'రోగ్‌' కనీసం ఓపెనింగ్స్‌ కూడా సాధించలేకపోయింది. ఇంతకాలం పేరున్న హీరోలతో, ఆసక్తికర కాంబినేషన్లతో ఓపెనింగ్స్‌ వరకు రాబడుతూ వచ్చిన పూరి ఒక కొత్త హీరోతో అనేసరికి పూర్తిగా తేలిపోయాడు. నయనతార నటించిన థ్రిల్లర్‌ 'డోర' నుంచి 'మాయ' మాదిరి ఫలితాన్ని ఆశించారు కానీ ఈసారి ఆమె మాయ చేయలేకపోయింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?