Advertisement

Advertisement


Home > Movies -

ఈవారం ట్రేడ్‌ టాక్‌

ఈవారం ట్రేడ్‌ టాక్‌

మణిరత్నం బ్రాండ్‌ నేమ్‌, దిల్‌ రాజు మార్కెటింగ్‌ కూడా యువ ప్రేక్షకులని 'చెలియా' వైపు ఆకర్షించలేకపోయాయి. నామమాత్రపు ఓపెనింగ్స్‌తో స్టార్ట్‌ అయిన చెలియా బాక్సాఫీస్‌ జర్నీ రెండవ రోజు నుంచే పరాజయం దిశగా సాగింది. కలెక్షన్స్‌లో ఏమాత్రం పెరుగుదల లేకపోవడం, టాక్‌ కూడా అనుకూలంగా రాకపోవడంతో వారం తిరగకుండానే చెలియా రిజల్ట్‌ క్లియర్‌ అయిపోయింది.

గురు లాభాల్లోకి ప్రవేశించి ఇప్పటికీ డీసెంట్‌ షేర్స్‌ తెచ్చుకుంటోంది. సమ్మర్‌లో వచ్చిన చిత్రాల్లో గురు ఒక్కటే ఇంతవరకు హిట్‌ అనిపించుకుంది. అయితే బాక్సాఫీస్‌ని బిజీగా వుంచేంత రేంజ్‌ ఈ చిత్రానికి లేకపోవడంతో చాలా థియేటర్లు వెలవెలబోతున్నాయి. బాహుబలి 2 రాకకోసం మార్కెట్‌ మొత్తం ఎదురు చూస్తోంది.

అయితే ఈలోగా శుక్రవారం విడుదలయిన 'మిస్టర్‌', 'శివలింగ' చిత్రాలు బాక్సాఫీస్‌ని బిజీగా వుంచుతాయని ఆశిస్తున్నారు. మిస్టర్‌ ఏ సెంటర్స్‌కి, శివలింగ బి,సి సెంటర్స్‌కి బాహుబలి వచ్చేంతవరకు ఫీడింగ్‌ ఇస్తాయని అనుకుంటున్నారు. వీటి ఫలితమేంటనేది తెలియాలంటే మరో వారం ఆగాల్సిందే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?