Advertisement

Advertisement


Home > Movies -

ఈవారం ట్రేడ్‌ టాక్‌

ఈవారం ట్రేడ్‌ టాక్‌

శ్రీను వైట్ల మరోసారి తన పేరుకి తగ్గ సినిమా అందించలేకపోయాడు. అతడినుంచి తాజాగా వచ్చిన 'మిస్టర్‌' తొలిరోజే ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుని, కలక్షన్ల పరంగా డిజాస్టర్‌ దిశగా సాగుతోంది. శ్రీను వైట్ల బ్రాండ్‌, వరుణ్‌ తేజ్‌ గుడ్‌విల్‌ కూడా ఈ చిత్రానికి నామమాత్రపు వసూళ్లు తీసుకురాకపోవడం ట్రేడ్‌ వర్గాలనే విస్మయపరిచింది. 

మార్కెట్లో బలమైన పోటీ లేకపోయినా మిస్టర్‌ డీసెంట్‌ ఓపెనింగ్‌ తెచ్చుకోకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంతకుముందు వారం రిలీజ్‌ అయిన చెలియాలానే మిస్టర్‌ కూడా బాక్సాఫీస్‌ వసూళ్ల పరంగా డిజాస్టర్‌ అనిపించుకుంది. మిస్టర్‌తో పాటు రిలీజ్‌ అయిన లారెన్స్‌ 'శివలింగ' మాస్‌ ఆదరణతో డీసెంట్‌ కలక్షన్స్‌ రాబట్టుకుంది. 

ఈవారం చెప్పుకోతగ్గ రిలీజ్‌లు లేవు కనుక శివలింగకి మరో వారం రోజుల పాటు ఫ్రీ రన్‌ వుంటుంది. సమ్మర్‌లో వచ్చిన స్ట్రెయిట్‌ చిత్రాల్లో గురు తప్ప మరో హిట్‌ లేకపోవడంతో మార్కెట్‌ డీలా పడింది. ఈ స్లంప్‌ అంతటినీ మరిపించే హై బాహుబలి 2 ఇస్తుందని వచ్చేవారం రాబోతున్న రాజమౌళి ఎపిక్‌ కోసం ట్రేడ్‌ ఎదురు చూస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?