Advertisement

Advertisement


Home > Movies -

ఈవారం ట్రేడ్‌ టాక్‌

ఈవారం ట్రేడ్‌ టాక్‌

'బాక్సాఫీస్‌ ఊపిరి పీల్చుకో... బాహుబలి మళ్లీ వచ్చేసింది'. ఎన్నో నెలలుగా అంతా ఎదురు చూస్తోన్న ఆ రోజు రానే వచ్చింది. మార్చి నుంచి వేధిస్తోన్న పరాజయాలతో పీక్‌ సమ్మర్‌లోను వెలవెలబోతున్న థియేటర్లు మళ్లీ కలక్షన్లతో కళకళలాడుతున్నాయి. అంచనాలకి మించిన ఓపెనింగ్‌ని బాహుబలి అందుకుంది.

మొదటి రోజు రికార్డులన్నీ మ్యాట్నీ షోకే పటాపంచలైపోయాయని ట్రేడ్‌ రిపోర్ట్స్‌ వస్తున్నాయి. బాహుబలి ఈ రికార్డులు కొడుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే రోజుకి ఎంత రాబడుతుంది, ఎన్ని రోజుల్లో వంద కోట్లని చేరుకుంటుంది, కేవలం తెలుగు వెర్షన్‌ నుంచే రెండు వందల కోట్ల షేర్‌ రాబడుతుందా? లాంటి ప్రశ్నలకి సమాధానమే తెలియాల్సి వుంది.

కనీ వినీ ఎరుగని హైప్‌తో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలని అందుకోగలిగింది. టాక్‌ అంతటా పాజిటివ్‌గానే వుంది కనుక ఈ చిత్రం ఎక్కడి వరకు రీచ్‌ అవుతుందనే దానిమీదే ట్రేడ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇండియన్‌ సినిమా హిస్టరీలో వెయ్యి కోట్ల గ్రాస్‌ వసూలు చేసే తొలి చిత్రంగా బాహుబలి నిలుస్తుందా? బాక్సాఫీస్‌ సునామీ చూస్తోంటే అది లాంఛనమే అనిపిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?