Advertisement

Advertisement


Home > Movies -

ఈవారం ట్రేడ్‌ టాక్‌

ఈవారం ట్రేడ్‌ టాక్‌

నాగార్జున లెక్క తప్పలేదు. కమర్షియల్‌ మీటర్‌లో పెట్టి కొట్టిన 'రారండోయ్‌ వేడుక చూద్దాం'కి రొటీన్‌గా వుందనే టాక్‌ వచ్చినప్పటికీ వసూళ్ల పరంగా లోటు రాలేదు. నాగచైతన్య సినిమాల్లో తొలి వారంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన 'రారండోయ్‌ వేడుక చూద్దాం' ఈ శనివారంలోగా లాభాల్లోకి చేరిపోతుంది.

ఆదివారానికి తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాలతో పాటు కర్నాటకలోను బ్రేక్‌ ఈవెన్‌ అయిపోతుంది. ఓవర్సీస్‌ మాత్రమే అండర్‌ పర్‌ఫార్మ్‌ చేసిన ఈ చిత్రానికి అక్కడ ఈ వీకెండ్‌ కీలకమవుతుంది. ఒకవేళ యుఎస్‌లో స్వల్ప నష్టం వచ్చినప్పటికీ థియేట్రికల్‌ రన్‌ పూర్తయ్యేసరికి ఈ చిత్రం పాతిక కోట్ల షేర్‌ తెచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

అదే జరిగితే చైతన్య సోలోగా చేసిన సినిమాల్లో పాతిక కోట్ల మార్కు దాటిన తొలి సినిమాగా రారండోయ్‌ నిలుస్తుంది. కేశవ రెండవ వారంలో బాగా డ్రాప్‌ కాగా, బాహుబలి 2 ఇంకా షేర్స్‌ మీద రన్‌ అవుతోంది. ఈ చిత్రానికి యాభై రోజుల కేంద్రాలు కూడా పెద్ద సంఖ్యలోనే వస్తాయని ట్రేడ్‌ చెప్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?