Advertisement

Advertisement


Home > Movies -

ఈవారం ట్రేడ్‌ టాక్‌

ఈవారం ట్రేడ్‌ టాక్‌

మూడు వారాల పాటు బాహుబలి జైత్రయాత్ర అప్రతిహతంగా సాగిపోయింది. తెలుగు రాష్ట్రాల నుంచి రెండు వందల కోట్ల షేర్‌ తెచ్చుకునే దిశగా బాహుబలి దూసుకుపోతోంది. మూడవ వారంలో కూడా స్టడీ కలక్షన్లు రావడంతో ఈ చిత్రం మరో రెండు వారాలైనా మంచి షేర్ల మీద రన్‌ అవుతుందని అంచనా వేస్తున్నారు. 

ఇప్పట్లో బాహుబలిని ఛాలెంజ్‌ చేసే భారీ చిత్రమేదీ లేకపోవడం కూడా లాంగ్‌ రన్‌ ఖాయం చేస్తోంది. హిందీలో నాలుగు వందల కోట్ల నెట్‌ వసూళ్లని దాటిన బాహుబలి 2, త్వరలో ఇండియాలో అయిదు వందల కోట్ల నెట్‌ సాధించిన తొలి హిందీ చిత్రంగా రికార్డులకి ఎక్కనుంది. తమిళనాడు, కేరళలో కూడా బాహుబలి 2 నెమ్మదించలేదు. 

బాహుబలి జోరు నాలు వారంలో తగ్గుముఖం పడుతుందనే ఆశతో ఈ వారం కేశవ విడుదల చేసారు. విభిన్నమైన కథాంశంతో, విలక్షణంగా కనిపిస్తోన్న ఈ చిత్రం సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించింది. అడ్వాన్స్‌ బుకింగ్స్‌ బాగున్నాయి కనుక సినిమా బాగుందనే టాక్‌ తెచ్చుకుంటే బాహుబలి 2 సమక్షంలోను మంచి విజయాన్ని అందుకోవడం అంత కష్టమేమీ కాదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?