Advertisement

Advertisement


Home > Movies -

ఈవారం ట్రేడ్‌ టాక్‌

ఈవారం ట్రేడ్‌ టాక్‌

'దువ్వాడ జగన్నాథమ్‌' రిలీజ్‌ వుండడంతో గత వారం చెప్పుకోతగ్గ ఏ చిత్రాన్ని విడుదల చేయలేదు. ఆది నటించిన మరకతమణి, కాదలి వగైరా చిన్న చిత్రాలు విడుదలయ్యాయి కానీ సినీ ప్రియులని ఆకర్షించలేకపోయాయి. దీంతో అంతకుముందు వారం విడుదలైన 'అమీ తుమీ' ఒక్కటే కాస్త చెప్పుకోతగిన వసూళ్లు సాధించింది.

ఏ సెంటర్స్‌ వరకు ఫర్వాలేదనిపించుకున్న అమీ తుమీ లో బడ్జెట్‌ వల్ల సక్సెస్‌ గీతని దాటగలిగింది. రారండోయ్‌ వేడుక చూద్దాంతో నాగచైతన్య సోలోగా బిగ్గెస్ట్‌ హిట్‌ సొంతం చేసుకున్నాడు. అంధగాడుతో రాజ్‌ తరుణ్‌ డీసెంట్‌ రన్‌కి బ్రేక్‌ పడలేదు.

బాహుబలి 2 ఎట్టకేలకు 'దువ్వాడ జగన్నాథమ్‌'కి దారి ఇస్తూ కొన్ని థియేటర్లు మినహా అన్నిటి నుంచి నిష్క్రమించింది.

ఈమధ్య కాలంలో భారీ చిత్రం 'డిజె'నే కావడంతో తొలి రోజు వసూళ్లు బ్రహ్మాండంగా వచ్చాయి. అల్లు అర్జున్‌ స్టార్‌డమ్‌ని తెలియజేస్తూ ఈ చిత్రం అంతటా మంచి ఓపెనింగ్‌ సాధించింది. అయితే రేంజ్‌ ఏంటనేది తెలియడానికి వీకెండ్‌ అయ్యేవరకు వేచి చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?