Advertisement

Advertisement


Home > Movies -

ఈవారం ట్రేడ్‌ టాక్‌

ఈవారం ట్రేడ్‌ టాక్‌

'దువ్వాడ జగన్నాథమ్‌' ఓపెనింగ్‌ కలక్షన్లతో అల్లు అర్జున్‌ తన సత్తా చాటుకున్నాడు. పెద్ద స్టార్లతో సమానంగా ఈసారి తన సినిమాకీ పెద్ద రిలీజ్‌ ప్లాన్‌ చేయడంతో మంచి ఓపెనింగ్స్‌ తెచ్చుకుంది డీజే.

అయితే టాక్‌ మాత్రం డివైడ్‌గా వుండడంతో, రిపీట్‌ వేల్యూ అసలు లేకపోవడంతో రంజాన్‌ పండగ అయిపోగానే డీజే వసూళ్లు తగ్గుముఖం పట్టాయి.

బుధ, గురువారాల్లో వసూళ్లు మరీ పడిపోవడంతో ఇక ఈ వీకెండ్‌లో ఎంత వస్తే అంతేనని ట్రేడ్‌ అంటోంది. లక్కీగా ఈ వారం చెప్పుకోతగ్గ సినిమా ఒక్కటీ లేకపోవడం డీజేకి హెల్ప్‌ అవుతుంది.

ఓవర్సీస్‌లో డిజప్పాయింట్‌ చేసిన ఈ చిత్రానికి బూస్ట్‌ ఇవ్వడానికి డీజే బృందం అక్కడికి టూర్‌ వెళ్లింది. సెకండ్‌ వీకెండ్‌లో వచ్చే వసూళ్లని బట్టి ఈ చిత్రం ఫైనల్‌ రేంజ్‌ డిసైడ్‌ అవుతుంది.

వర్కింగ్‌ డేస్‌లో డీజే వసూళ్లు బాగా డ్రాప్‌ అవడంతో, ఆడించుకోవడానికి మరో సినిమా లేక మార్కెట్లో ఆందోళన నెలకొంది. వచ్చే వారం రిలీజ్‌ అవుతోన్న నాని సినిమా 'నిన్ను కోరి' ఏ సెంటర్స్‌ వరకు ఈ లోటు భర్తీ చేయగలదని బిజినెస్‌ సర్కిల్స్‌ ఆశ పడుతున్నాయి.

జులై, ఆగస్టులో రిలీజ్‌లు బాగానే వున్నప్పటికీ పెద్ద సినిమాలన్నీ సెప్టెంబర్‌ వరకు రావు కనుక ఈలోగా రెండు, మూడు మీడియం బడ్జెట్‌ చిత్రాలైనా పెద్ద హిట్‌ అయి మార్కెట్‌ని నిలబెట్టాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?