Advertisement

Advertisement


Home > Movies -

ఈవారం ట్రేడ్‌ టాక్‌

ఈవారం ట్రేడ్‌ టాక్‌

మొదటి వారాంతం ముగిసేసరికే డీలా పడ్డ 'దువ్వాడ జగన్నాథమ్‌' రెండవ వారంలో పోటీ లేకపోయినప్పటికీ అంతగా క్యాష్‌ చేసుకోలేదు. రెండవ ఆదివారం మినహా మిగతా రోజుల్లో వసూళ్లు అంతంత మాత్రంగా వచ్చాయి. అన్ని ఏరియాల్లో వసూళ్లు పడిపోవడంతో ఈ చిత్రం అంతిమంగా యావరేజ్‌ స్థాయితో సరిపెట్టుకునేలా వుంది.

సల్మాన్‌ఖాన్‌కి చాలా కాలం తర్వాత 'ట్యూబ్‌లైట్‌'తో ఫ్లాప్‌ వచ్చింది. ఈ చిత్రం అతి పెద్ద డిజాస్టర్‌ కావడంతో తమ పెట్టుబడిని తిరిగి ఇవ్వమంటూ బయ్యర్లు వేడుకుంటున్నారు.

ఇక ఈవారం రిలీజ్‌ అయిన నాని 'నిన్ను కోరి' చిత్రం విడుదలకి ముందునుంచే ఆసక్తి రేపుతోంది. కథల ఎంపికతో ఆకట్టుకుంటోన్న నానిపై నమ్మకం పెరిగిందనే సంగతి ఓపెనింగ్స్‌ ద్వారా తెలుస్తోంది.

ఇకపై ప్రతి వారం ఒక చెప్పుకోతగ్గ చిత్రం రిలీజ్‌కి సిద్ధంగా వుండడంతో బాహుబలి తర్వాత డల్‌ అయిన మార్కెట్‌ ఉత్సాహం పుంజుకుంటుందని బిజినెస్‌ సర్కిల్స్‌ ఆశిస్తున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?