Advertisement

Advertisement


Home > Movies -

ఈవారం ట్రేడ్‌ టాక్‌

ఈవారం ట్రేడ్‌ టాక్‌

గత వారం విడుదలైన సినిమాల్లో 'శమంతకమణి' చిత్రానికి డీసెంట్‌ ఓపెనింగ్‌ వచ్చింది. వీకెండ్‌ వరకు బాగానే ఆడిన సినిమాకి ఆ తర్వాత వర్షాల దెబ్బ పడింది. అసలే సీజన్‌ సినిమాలకి అనుకూలం కాకపోవడంతో వర్కింగ్‌ డేస్‌లో వసూళ్లు వుండడం లేదు. దానికి తోడు వర్షాలు తీవ్రంగా పడుతూ వుండడంతో బాక్సాఫీస్‌ డీలా పడిపోయింది.

జగపతిబాబు నటించిన 'పటేల్‌ సర్‌' అయితే డిజాస్టర్‌ టాక్‌ తెచ్చుకుని తొలి రోజే తిరస్కరణకి గురయింది. అంతకుముందు వారం విడుదలైన 'నిన్ను కోరి' పది రోజుల పాటు బ్రహ్మాండంగా నడిచింది. అయితే ఆ తర్వాత దానిని కూడా వర్షాలు వేధించడంతో వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. ముప్పయ్‌ కోట్ల షేర్‌ దాటుతుందా లేదా అనేది ఈ వీకెండ్‌ పర్‌ఫార్మెన్స్‌తో తెలుస్తుంది.

శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మాణంలో వరుణ్‌ తేజ్‌ నటించిన 'ఫిదా' ఈవారం రిలీజ్‌ అయింది. ఏ సెంటర్స్‌లో ఈ చిత్రం బాగా రన్‌ అవుతుందనే అంచనాలున్నాయి. పబ్లిక్‌ వర్డిక్ట్‌ ఏమిటనేది మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?