Advertisement

Advertisement


Home > Movies -

ఈవారం ట్రేడ్‌ టాక్‌

ఈవారం ట్రేడ్‌ టాక్‌

'నక్షత్రం' బ్లాక్‌బస్టర్‌ అవుతుందంటూ కృష్ణవంశీ అచంచలమైన నమ్మకాన్ని చూపించాడు. ఆడియన్స్‌ సర్‌ప్రైజ్‌ అయిపోతారని, ఎవరూ ఊహించని విధంగా ఈ చిత్రం ఆకట్టుకుంటుందని చాలానే చెప్పాడు. అయితే ఈ చిత్రంపై వున్న అంచనాలకి తగ్గట్టే నక్షత్రం అట్టర్‌ఫ్లాప్‌ అయింది. తొలి ఆటకే ఈ చిత్రం బండారం బయటపడిపోవడంతో రెండో ఆట నుంచే డ్రాప్‌ స్టార్ట్‌ అయింది.

ఈ చిత్రంతో పాటుగా రిలీజ్‌ అయిన సుకుమార్‌ నిర్మించిన దర్శకుడు చిత్రానికి ఆకట్టుకునే ఇతివృత్తం వున్నా కానీ కథానాయకుడు వీక్‌ అవడంతో జనాన్ని మెప్పించలేకపోయింది. ఈ రెండు చిత్రాలు డిజాస్టర్‌ అవడంతో 'ఫిదా'కి మూడవ వారంలో కూడా ఎదురు లేకుండా పోయింది. వారాంతాల్లో అద్భుతంగా, వీక్‌ డేస్‌లో స్టడీగా రన్‌ అయిన ఫిదా నలభై కోట్ల మార్కుకి చేరువగా వచ్చింది.

ఈవారంలో మూడు సినిమాలు రిలీజ్‌ అవడంతో ఫిదా థియేటర్లు తగ్గిపోయాయి. బ్లాక్‌బస్టర్‌ స్టేటస్‌ని దక్కించేసుకున్న ఈ చిత్రానికి లాంగ్‌ వీకెండ్‌ ఇంకాస్త దోహదపడుతుంది. ఇక ఈ వారం విడుదలైన మూడు చిత్రాల్లో ఫైనల్‌గా ఏది విన్నర్‌ అవుతుందనేది సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?