Advertisement

Advertisement


Home > Movies -

ఈవారం ట్రేడ్‌ టాక్‌

ఈవారం ట్రేడ్‌ టాక్‌

త్రిముఖ పోరులో 'నేనే రాజు నేనే మంత్రి' ఆధిపత్యం చలాయించింది. తొలి వారంలో మిగిలిన రెండు సినిమాల కంటే ఎక్కువ వసూళ్లు సాధించిన ఈ చిత్రం బడ్జెట్‌ కూడా తక్కువ కావడంతో వారంలోనే బ్రేక్‌ ఈవెన్‌ అయిపోయింది. అత్యధిక థియేటర్లతో సురేష్‌బాబు ప్లానింగ్‌, రానా దగ్గుబాటి పబ్లిసిటీ ఈ చిత్రాన్ని మంచి రేంజ్‌కి తీసుకెళ్లాయి.

'జయ జానకి నాయక' చిత్రానికి మాస్‌ నుంచి మంచి స్పందన వచ్చినప్పటికీ, స్టార్‌ హీరో లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపించింది. బోయపాటి శ్రీను బ్రాండ్‌ ఈ చిత్రానికి చెప్పుకోతగ్గ వసూళ్లు తెచ్చినా కానీ అమ్మిన రేట్లకి, వసూలైన దానికి పొంతన లేకుండా పోయింది. సరైన రిలీజ్‌ స్ట్రాటజీ లేక ఈ చిత్రం స్ట్రగుల్‌ అయింది.

ఇక 'లై' అయితే ఈ త్రిముఖ పోరులో దారుణంగా దెబ్బతింది. సెలవులు కలిసి వస్తాయని సీజన్‌ కాని టైమ్‌లో ఎక్కువ చిత్రాలు విడుదల చేస్తే ఏమవుతుందో ఈ చిత్రం తెలియజెప్పింది. ఫిదా నాలుగోవ వారంలోను మంచి వసూళ్లు తెచ్చుకుని నలభై అయిదు కోట్లకి మించి షేర్‌ సాధించింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?