Advertisement

Advertisement


Home > Movies -

ఈవారం ట్రేడ్‌ టాక్‌

ఈవారం ట్రేడ్‌ టాక్‌

నాగచైతన్య జోనర్‌ మార్చిన ప్రతిసారీ చుక్కెదురైంది. 'యుద్ధం శరణం' అతని కెరీర్లో వన్‌ ఆఫ్‌ ది బిగ్గెస్ట్‌ ఫ్లాప్స్‌ అయ్యేలా తొలి వారంలో దారుణంగా పర్‌ఫార్మ్‌ చేసింది. ఈ చిత్రాన్ని వారాహి చలనచిత్రం సరిగా మార్కెట్‌ చేయకపోవడంతో ఓపెనింగ్స్‌ కూడా రాబట్టలేకపోయింది. నాగచైతన్య మార్కెట్‌కి అనుగుణంగా దీనిని ఇరవై కోట్లకి అమ్మారు కానీ అందులో సగం కూడా రాదని ట్రేడ్‌ రిపోర్టులు వస్తున్నాయి.

అల్లరి నరేష్‌కి 'మేడమీద అబ్బాయి'తో మరో ఫ్లాప్‌ తగిలింది. ఈ చిత్రానికి కూడా పబ్లిసిటీ వీక్‌ అవడం వల్ల ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయింది. 'పైసా వసూల్‌'తో బయ్యర్లు సగానికి పైగా నష్టపోయారు. అర్జున్‌ రెడ్డి పాతిక కోట్ల షేర్‌ రాబట్టుకుని చిన్న చిత్రాలకి బెంచ్‌ మార్క్‌ సెట్‌ చేసింది.

వచ్చేవారం నుంచి పెద్ద సినిమాల సందడి వుండడంతో ఈ వారంలో పలు చిత్రాలు అదృష్టం పరీక్షించుకున్నాయి. సునీల్‌ 'ఉంగరాల రాంబాబు', నారా రోహిత్‌ 'కథలో రాజకుమారి', విజయేంద్రప్రసాద్‌ డైరెక్ట్‌ చేసిన 'శ్రీవల్లి' అన్నీ ఈ వారంలోనే విడుదలయ్యాయి. జై లవకుశ సందడి మొదలయ్యేలోగా ఇవి గట్టెక్కగలవేమో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?