Advertisement

Advertisement


Home > Movies -

ఈవారం ట్రేడ్‌ టాక్‌

ఈవారం ట్రేడ్‌ టాక్‌

హీరోగా నిలబడాలనే సునీల్‌ కలలు కల్లలయ్యాయి. 'ఉంగరాల రాంబాబు' అతని సినిమాల్లోనే అతి పెద్ద పరాజయంగా నిలిచింది. తల తోక లేకుండా తీసిన ఈ చిత్రం ఫెయిల్యూర్‌తో సునీల్‌ మార్కెట్‌ పూర్తిగా పడిపోయింది. ఇక నటుడిగా కొనసాగాలంటే మునుపటిలా హాస్య పాత్రలు వేసుకోక తప్పదు మరి.

గత వారంలోనే రిలీజ్‌ అయిన నారా రోహిత్‌ 'కథలో రాజకుమారి' కూడా ఎవరూ నోటీస్‌ చేయకుండానే పోయింది. నిర్మాణ దశలో ఆటుపోట్లు ఎదుర్కొన్న ఈ చిత్రం హడావిడి లేకుండా వచ్చేసి ఫ్లాప్‌ అయిపోయింది. విజయేంద్రప్రసాద్‌ డైరెక్ట్‌ చేసిన 'శ్రీవల్లి' కనీసం ఓపెనింగ్స్‌ అయినా తెచ్చుకోలేకపోయింది. మూడు రోజుల్లోనే థియేటర్ల నుంచి నిష్క్రమించిన ఈ చిత్రం విజయేంద్రప్రసాద్‌కి ఒక మచ్చలా మిగిలిపోతుంది.

యుద్ధం శరణం భారీ ఫ్లాప్‌ మూటగట్టుకుంది. మేడ మీద అబ్బాయి, పైసా వసూల్‌ అన్నీ కూడా ఫ్లాప్‌ అయి సెప్టెంబర్‌ని కష్టంగా మార్చాయి. ఈ నేపథ్యంలో వచ్చిన 'జై లవకుశ' మళ్లీ చలనం తీసుకు వస్తుందని అంచనాలున్నాయి. యావరేజ్‌ రిపోర్టులు తెచ్చుకున్న ఈ చిత్రం ఓపెనింగ్స్‌ అయితే బాగున్నాయి. అయితే ఎంతవరకు సస్టెయిన్‌ అవుతుందనేది చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?