Advertisement

Advertisement


Home > Movies -

ఈవారం ట్రేడ్‌ టాక్‌

ఈవారం ట్రేడ్‌ టాక్‌

బాక్సాఫీస్‌ వద్ద స్లంప్‌ లాస్ట్‌ వీక్‌ కూడా కంటిన్యూ అయింది. పరీక్షల సమయం కావడంతో పెద్ద చిత్రాలేవీ రిలీజ్‌ చేయలేదు. వచ్చిన చిన్న చిత్రాలకి ప్రేక్షకులని థియేటర్లకి రప్పించే ఆకర్షణ శక్తి కొరవడడంతో ఇంకో వారం నీరసంగా గడిచిపోయింది. సినిమాలేవీ లేక 'నేను లోకల్‌' లాంటి చిత్రాలని రీ రన్‌ చేయాల్సి వచ్చింది.

'కాటమరాయుడు' రాకతో ఈ వారం పరిస్థితి మారుతుంది. పవన్‌కళ్యాణ్‌ సినిమా అంటే ఓపెనింగ్స్‌కి ఢోకా వుండదు కనుక ఈ వారంలో కాసుల గలగలలు మళ్లీ వినిపిస్తాయి. అయితే బయ్యర్లు భారీ పెట్టుబడులు పెట్టిన ఈ చిత్రం ఖచ్చితంగా విజయవంతమైతే తప్ప గట్టెక్కడం కష్టం. 

ఎనభైఅయిదు కోట్లు వసూలు చేసినట్టయితే కాటమరాయుడుని సేఫ్‌ కింద జమ కట్టవచ్చునట. ఇక ఈవారం నుంచి ప్రతి శుక్రవారం ఏదో ఒక చెప్పుకోతగ్గ సినిమా వస్తుంటుంది. అలాగే వేసవి సెలవులు కూడా మొదలయ్యాయి కనుక సినిమా వ్యాపారం మళ్లీ పుంజుకుంటుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?