Advertisement

Advertisement


Home > Movies -

ఈవారం ట్రేడ్‌ టాక్‌

ఈవారం ట్రేడ్‌ టాక్‌

దీపావళి ముందు రోజు రిలీజ్‌ అయిన రాజా ది గ్రేట్‌ బాక్సాఫీస్‌ వద్ద పండగ చేసుకుంది. వీకెండ్‌కి రెండు రోజుల ముందే రావడం, పండగ సెలవు కలిసి రావడంతో ఈ చిత్రానికి ఆరంభ వసూళ్లు అదిరిపోయాయి. అయిదు రోజుల్లోనే ఈ చిత్రానికి మూడొంతుల పెట్టుబడి తిరిగి రావడంతో ఆ తర్వాత నెమ్మదించినా కానీ బయ్యర్లకి చింత లేకపోయింది.

అంతకుముందు వారం విడుదలైన రాజుగారి గది2 తొలి వారాం తర్వాత పూర్తిగా డ్రాప్‌ అయిపోవడంతో రాజా ది గ్రేట్‌కి హెల్ప్‌ అయింది. రాజుగారి గది 2 చిత్రానికి బయ్యర్లకి స్వల్ప నష్టాలు తప్పవని తేలిపోయింది. ఈవారం రిలీజ్‌ అయిన 'ఉన్నది ఒకటే జిందగీ' ప్రధానంగా సిటీస్‌ని టార్గెట్‌ చేసిన చిత్రం కావడం 'రాజా ది గ్రేట్‌'కి కలిసి వస్తుంది.

రవితేజ కెరియర్లో హయ్యస్ట్‌ గ్రాసర్‌గా నిలిచే ఈ చిత్రం బయ్యర్లకి కాసిని లాభాలు తెచ్చిపెట్టడం, హిట్‌ అనిపించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. నవంబర్‌లో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో పలు చిన్న చిత్రాల నిర్మాతలు అదృష్టం పరీక్షించుకోవడానికి సిద్ధపడుతున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?