Advertisement

Advertisement


Home > Movies -

ఈవారం ట్రేడ్‌ టాక్‌

ఈవారం ట్రేడ్‌ టాక్‌

'ఉన్నది ఒకటే జిందగీ' పరాజయ బాటలో పయనిస్తోంది. ఫస్ట్‌ త్రీ డేస్‌ మంచి కన్సిస్టెన్సీ చూపించిన ఈ చిత్రం సోమవారానికి బాగా డ్రాప్‌ అయింది. అక్కడి నుంచి తిరోగమన దిశగా సాగుతోన్న ఈ చిత్రానికి ప్రమోషన్స్‌ కూడా తగ్గించేసారు. యూత్‌లో రేజ్‌ అవుతుందని, హ్యాపీడేస్‌ మాదిరిగా యువతరాన్ని ఉర్రూతలూగిస్తుందని అంచనా వేసిన ఈ చిత్రానికి మొదటే మిశ్రమ స్పందన వచ్చింది.

నేను శైలజ చిత్రంలో వినోదాన్ని, భావోద్వేగాలని అందంగా మిళితం చేసిన కిషోర్‌ తిరుమల ఈ చిత్రానికి వచ్చేసరికి చేతులెత్తేసాడు. ఒక పాత తరహా సినిమాని తయారు చేసి ఆకట్టుకోని ఎమోషన్లతో విసిగించాడు. దీంతో ఈ చిత్రంపై ఆసక్తి వున్నప్పటికీ టాక్‌ బాలేకపోవడంతో వసూళ్లు రావడం లేదు. మరోవైపు రాజా ది గ్రేట్‌ చిత్రం దిల్‌ రాజు డిస్ట్రిబ్యూట్‌ చేసిన ఏరియాల్లో మాత్రమే భారీ షేర్లు రాబట్టుకుని, మిగతా చోట్ల బ్రేక్‌ ఈవెన్‌ కోసం తంటాలు పడుతోంది.

దీంతో మూడోవారంలో మూడు కొత్త సీన్లు యాడ్‌ చేసామంటూ కొత్త ట్రిక్‌కి పాల్పడుతున్నారు. రాజుగారి గది 2 నష్టాలతోనే సరిపెట్టుకుంది. సెప్టెంబర్‌ నుంచి మహానుభావుడు తప్ప క్లీన్‌ హిట్‌ అనిపించుకున్న మరో సినిమా లేకపోవడంతో మార్కెట్‌ కాస్త డల్‌గానే వుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?