Advertisement

Advertisement


Home > Movies -

ఈవారం ట్రేడ్‌ టాక్‌

ఈవారం ట్రేడ్‌ టాక్‌

'పిఎస్‌వి గరుడ వేగ' చిత్రంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రవీణ్‌ సత్తారు సత్తాని, రాజశేఖర్‌ మొండి ధైర్యాన్ని అంతా మెచ్చుకుంటున్నారు. చాలా కాలం తర్వాత తన సినిమా గురించి అంతా మాట్లాడుకుంటూ వుండేసరికి రాజశేఖర్‌ ఆనందిస్తున్నారు. కాకపోతే ప్రశంసలకి తగ్గ వసూళ్లు కనిపించడం లేదు.

తక్కువ ధరకి విక్రయించిన ఓవర్సీస్‌లో తప్ప ఈ చిత్రం మిగతా చోట్ల గొప్పగా ఆడడం లేదు. సినిమాపై ఖర్చు ఘనంగా అవడం వల్ల రాజశేఖర్‌ వాళ్లు ఆర్థికంగా రికవర్‌ అవుతారా లేదా అనేది చూడాలి. సినిమాకి మంచి టాక్‌ రావడం వల్ల డిజిటల్‌, శాటిలైట్‌ హక్కుల రూపంలో డబ్బులు బాగానే వస్తాయి కానీ థియేట్రికల్‌గా వచ్చే రిటర్న్స్‌ ఇంకా పెరగాలి.

ఇక తెలుగులో ఆలస్యంగా విడుదలైన 'అదిరింది' ఆరంభం అదిరింది. ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే షేర్లు వచ్చాయి. రానున్న రోజుల్లో వసూళ్లు బాగా పడిపోయినా కానీ సేఫ్‌ సినిమా అవుతుందని ట్రేడ్‌ చెబుతోంది. ఉన్నది ఒకటే జిందగీ ఫ్లాప్‌గా మిగిలిపోగా, నెక్స్‌ట్‌ నువ్వే, ఏంజెల్‌ కూడా ప్రేక్షకులని ఆకర్షించలేకపోయాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?