Advertisement

Advertisement


Home > Movies -

ఈవారం ట్రేడ్‌ టాక్‌

ఈవారం ట్రేడ్‌ టాక్‌

మరోసారి అనువాద చిత్రానికే పైచేయి దక్కింది. గత వారం చాలా సినిమాలు విడుదలైనా కానీ కార్తీ నటించిన 'ఖాకి' చిత్రం బాక్సాఫీస్‌ని డామినేట్‌ చేసింది. ఫస్ట్‌ వీకెండ్‌ వరకు అదరగొట్టిన ఖాకి ఆ తర్వాత బాగా నెమ్మదించింది కానీ మిగతా సినిమాలన్నీ డల్‌గా వుండడంతో వారమంతా అదే టాప్‌లో కొనసాగింది.

దీంతోపాటే రిలీజ్‌ అయిన హారర్‌ సినిమా గృహం ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఈ చిత్రం స్టడీ కలక్షన్లతో రన్‌ అవుతోంది కానీ హారర్‌ కామెడీల మాదిరిగా కాసుల వర్షం అయితే కురిపించలేకపోతోంది. ఈ వారం కూడా మరికొన్ని చెప్పుకోతగ్గ చిత్రాలు రిలీజ్‌ అయ్యాయి.

వాటిలో నారా రోహిత్‌ నటించిన బాలకృష్ణుడు, పెళ్లిచూపులు నిర్మాత తీసిన మెంటల్‌ మదిలో ముందుంటాయి. రోహిత్‌ బాలకృష్ణుడుతో మాస్‌ ఇమేజ్‌ కోసం చూస్తున్నాడు. శ్రీవిష్ణు ఏమో మెంటల్‌ మదిలోతో గుర్తింపు ఆశిస్తున్నాడు. వచ్చే వారం నుంచి కాస్త పెద్ద సినిమాల సందడి మొదలవుతుంది కనుక ఈలోగా ఈ చిత్రాలు క్యాష్‌ చేసుకోవాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?