Advertisement

Advertisement


Home > Movies -

ఈవారం ట్రేడ్‌ టాక్‌

ఈవారం ట్రేడ్‌ టాక్‌

నారా రోహిత్‌కి మళ్లీ పరాభవం ఎదురైంది. గత వారం విడుదలైన బాలకృష్ణుడు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. కొత్త తరహా కథలు ఎంచుకునే రోహిత్‌ ఈసారి రొటీన్‌ సినిమా ట్రై చేసి దెబ్బతిన్నాడు. శ్రీవిష్ణు ఎన్నో ఆశలు పెట్టుకున్న 'మెంటల్‌ మదిలో' ఫ్లాప్‌ అయింది.

పెళ్లిచూపులు చిత్రానికి చేసినట్టుగా విడుదలకి ముందే చాలా షోలు వేసి సోషల్‌ మీడియాలో హైప్‌ తీసుకురావాలని చూసారు కానీ ఆ ప్లాన్‌ వర్కవుట్‌ అవలేదు. ఈసారి ప్రేక్షకులు ఈ చిత్రాన్ని పట్టించుకోలేదు. పైగా ప్రేక్షకుల సైడ్‌ నుంచి కూడా తగిన స్పందన లేకపోవడంతో మెంటల్‌ మదిలో తొలివారం భారంగా గడిచింది.

వీటితో పాటుగా విడుదలైన నెపోలియన్‌ తదితర చిత్రాలకి ప్రేక్షకుల నుంచి కనీస స్పందన లేకపోయింది. ఖాకి చిత్రం బాక్సాఫీస్‌ పరంగా ఫర్వాలేదనిపించుకోగా, గృహం కూడా ఒక మాదిరిగా ఆడింది. ఈవారంలో ఆక్సిజన్‌, జవాన్‌, ఇంద్రసేన చిత్రాలు రిలీజ్‌ అయ్యాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?