Advertisement

Advertisement


Home > Movies -

ఈవారం ట్రేడ్‌ టాక్‌

ఈవారం ట్రేడ్‌ టాక్‌

టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ స్లంప్‌ నుంచి బయట పడలేదు. గత రెండు నెలల్లో బాక్సాఫీస్‌ వద్ద చెప్పుకోతగ్గ విజయం లేదు. అదిరింది, ఖాకీ లాంటి అనువాద చిత్రాలు ఓ మాదిరిగా ఆడాయి కానీ స్ట్రెయిట్‌ సినిమాలు బోల్తా కొట్టాయి. జనాకర్షక శక్తి వున్న సినిమాలు లేకపోవడంతో సినిమా బిజినెస్‌ బాగా డల్‌గా సాగుతోంది.

జవాన్‌ చిత్రం కూడా ఫ్లాప్‌ అవడంతో ఇక వచ్చే వారం రాబోతున్న మిడిల్‌ క్లాస్‌ అబ్బాయ్‌, హలో మీదే ఆశలున్నాయి. గత వారం విడుదలైన సప్తగిరి ఎల్‌ఎల్‌బి మాస్‌ కేంద్రాల్లో ఓపెనింగ్స్‌ ఫర్వాలేదనిపించుకుంది కానీ ఆ తర్వాత బాగా డ్రాప్‌ అయింది. మళ్లీ రావా చిత్రం మల్టీప్లెక్సుల్లో రీజనబుల్‌గా ఆడుతున్నా కానీ వస్తోన్న రిటర్న్స్‌ అంత గొప్పగా లేవు.

నవంబర్‌ నుంచి డిసెంబర్‌ మొదటి అర్థ భాగం వరకు సినిమా బిజినెస్‌ ఎప్పుడూ డల్‌గానే వుంటుందని ట్రేడ్‌ అంటోంది. డిసెంబర్‌ మూడవ వారం నుంచే వసూళ్లు పుంజుకుంటాయట. దానికి అనుగుణంగా చూస్తే ఎంసిఏ, హలో నుంచి మళ్లీ సినిమా బిజినెస్‌ కళకళలాడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?