Advertisement


Home > Movies - Trade Talk
ఈవారం ట్రేడ్‌ టాక్‌

చాలా కాలం తర్వాత మళ్లీ తెలుగు సినిమా బాక్సాఫీస్‌ దగ్గర కాసుల గలగలలు వినిపించాయి. ఎంసిఏ చిత్రానికి అదిరిపోయే ఓపెనింగ్‌ వచ్చింది. కొన్ని వారాలుగా అసలు వసూళ్లు లేక విలవిలలాడిన తెలుగు సినిమా బాక్సాఫీస్‌ దగ్గర పండగ సందడి స్టార్ట్‌ అయింది.

సప్తగిరి ఎల్‌ఎల్‌బి చిత్రాన్ని ఎలాగైనా సక్సెస్‌ చేసుకోవాలని టూర్‌కి వెళ్లిన సప్తగిరి ప్లాన్స్‌ వర్కవుట్‌ అవలేదు. ఆ చిత్రానికి నిరాశాజనకమైన వసూళ్లే వచ్చాయి. సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ స్థాయి వసూళ్లని కూడా అది తెచ్చుకోలేకపోయింది. ఇక మళ్లీ రావా చిత్రం కూడా కేవలం సక్సెస్‌ మీట్ల సినిమాగా మిగిలింది.

మెంటల్‌ మదిలో సినిమా తర్వాత ప్రశంసలే తప్ప వసూళ్లు రాని సినిమాగా ఇది నిలిచింది. హలో చిత్రానికి కూడా డీసెంట్‌ అడ్వాన్స్ బుకింగ్స్ వచ్చాయి. ఎంసిఏ, హలో చిత్రాలు క్రిస్మస్‌ సెలవులని క్యాష్‌ చేసుకుంటాయని బయ్యర్లు ఆశలు పెట్టుకున్నారు. సంక్రాంతికి భారీ సినిమాలు విడుదలయ్యే వరకు ఇవి ఒక రెండు వారాంతాలు హోల్డ్‌ చేస్తే తర్వాత సంక్రాంతి సినిమాలు టేకోవర్‌ చేసుకుంటాయి.