Advertisement

Advertisement


Home > Movies -

ఈవారం ట్రేడ్‌ టాక్‌

ఈవారం ట్రేడ్‌ టాక్‌

'ఆనందో బ్రహ్మ' కామెడీతో ఆకట్టుకుని తొలివారంలో మంచి వసూళ్లు వెనకేసుకుంది. లిమిటెడ్‌ సెంటర్స్‌లో రిలీజ్‌ చేసినప్పటికీ ఇది లో బడ్జెట్‌ సినిమా కావడంతో సక్సెస్‌ఫుల్‌ ప్రాజెక్ట్‌ కాగలిగింది. ఓవర్సీస్‌లోనే నాలుగు లక్షల డాలర్లు వసూలు చేసే దిశగా సాగుతోన్న ఈ చిత్రం లోకల్‌గా కూడా బాగా ఆడుతోంది.

ఈ చిత్రానికి వచ్చిన టాక్‌కి శాటిలైట్‌ హక్కుల రూపంలోనే పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేస్తుంది. ఇక ఇతర రీమేక్‌, డబ్బింగ్‌ హక్కులు వుండనే వుంటాయి. థియేటర్ల నుంచి వచ్చేదంతా లాభాల్లోకే వెళుతుంది. హారర్‌ కామెడీలు పెద్ద సంఖ్యలో వస్తున్నప్పటికీ ఆసక్తికరమైన కథాంశానికి వినోదం జోడిస్తే సక్సెస్‌ అవుతుందని ఇది నిరూపించింది.

జయ జానకి నాయక స్టడీ కలక్షన్లు రాబట్టినా భారీ రేట్లకి అమ్మడం వల్ల ఫ్లాప్‌ దిశగా సాగుతోంది. క్రేజ్‌ని ఫాస్ట్‌గా క్యాష్‌ చేసుకున్న నేనే రాజు నేనే మంత్రి హిట్‌ అయింది. లై డిజాస్టర్‌ కాగా, ఫిదా యాభై కోట్ల క్లబ్‌లో చేరేట్టుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?