Advertisement

Advertisement


Home > Movies -

ఈవారం ట్రేడ్‌ టాక్‌

ఈవారం ట్రేడ్‌ టాక్‌

'ఫిదా'తో భారీ విజయాన్ని చవిచూసిన తెలుగు చిత్ర పరిశ్రమకి మరి కొద్ది వారాల్లోనే మరో ఘన విజయం 'అర్జున్‌ రెడ్డి' రూపంలో వచ్చింది. నాలుగు కోట్ల బిజినెస్‌ చేసిన ఈ చిత్రం తొలి వారాంతానికే పన్నెండు కోట్లు వసూలు చేసింది. ఫుల్‌ రన్‌లో పాతిక కోట్లకి పైగా షేర్‌ వసూలవుతుందనే అంచనాలున్నాయి. చిన్న సినిమాల్లో భారీ విజయాన్ని అందుకున్న అర్జున్‌ రెడ్డి కొత్తరకం చిత్రాల రూపకల్పనకి తెర తీసింది.

పద్ధతులు, కట్టుబాట్లు అన్నట్టుండే తెలుగు సినిమా తీరుతెన్నులని అర్జున్‌ రెడ్డి మార్చింది. బోల్డ్‌ కంటెంట్‌తో సినిమాలు తీసినా ఆదరణ బాగుంటుందని రుజువు చేసింది. ఇక అంతకుముందు వారం రిలీజ్‌ అయిన ఆనందో బ్రహ్మ విజయాన్ని సాధించింది. గత వారం వచ్చిన అజిత్‌ 'వివేకం' చిత్రానికి మొదటి రోజు వసూళ్లు బాగానే వచ్చాయి కానీ ఫ్లాప్‌ టాక్‌ వల్ల నిలబడలేకపోయింది.

'రఘువరన్‌ బిటెక్‌' చిత్రానికి కొనసాగింపు అయిన 'విఐపి 2' చిత్రం 'వివేకం' కంటే మెరుగ్గా ఆడుతోంది కానీ ఇది కూడా మెప్పించలేకపోయింది. 'ఫిదా' ఇప్పటికీ షేర్స్‌ మీద రన్‌ అవుతూ యాభై రోజుల ప్రదర్శన పూర్తి చేసుకోనుంది. ఈవారం బాలకృష్ణ, పూరి జగన్నాథ్‌ల 'పైసా వసూల్‌' రిలీజ్‌ అయి ఓపెనింగ్స్‌ బాగానే తెచ్చుకుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?