Advertisement

Advertisement


Home > Movies -

ఈవారం ట్రేడ్‌ టాక్‌

ఈవారం ట్రేడ్‌ టాక్‌

నాని రేంజ్‌ పెరిగింది. దిల్‌ రాజు స్ట్రాటజీ మహత్యమో, సాయి పల్లవి క్రేజ్‌ మహిమో మొత్తానికి 'ఎంసిఏ' చిత్రం మొదటి వారంలోనే సేఫ్‌ అయిపోయింది. వీక్‌ కంటెంట్‌ వున్న సినిమాతో నాని తన సత్తా చాటుకుంటున్నాడు. దీంతో పాటు రిలీజ్‌ అయిన హలో చిత్రానికి టాక్‌ బాగున్నా కానీ ఎంసీఏ ప్రతిబంధకంగా మారింది.

ఎంసిఏ ఎఫెక్ట్‌ తీవ్రంగా పడడంతో హలో చిత్రానికి ఆశించిన వసూళ్లు రాలేదు. అఖిల్‌కి నటుడిగా పేరు వచ్చిందనే తృప్తి తప్ప ఈ చిత్రంతో నిర్మాతగా నాగార్జునకి నష్టాలు తప్పేట్టు లేవు. జనవరి 10న అజ్ఞాతవాసి వుండడంతో డిసెంబర్‌ చివరి వారంలో రెండు సినిమాలు రిలీజ్‌ అయ్యాయి.

అల్లు శిరీష్‌ నటించిన ఒక్క క్షణం చిత్రానికి మిశ్రమ స్పందన వస్తోంది. ఆరంభ వసూళ్ల పరంగా ఈ చిత్రం అంతగా మెప్పించలేకపోయింది. ఇక సునీల్‌ టూ కంట్రీస్‌ శుక్రవారమే విడుదలైంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?