Advertisement

Advertisement


Home > Movies -

ఈవారం ట్రేడ్‌ టాక్‌

ఈవారం ట్రేడ్‌ టాక్‌

సాయి ధరమ్‌ తేజ్‌కి పెరుగుతోన్న ప్రేక్షకాదరణని తెలియజేస్తూ 'విన్నర్‌' సూపర్‌ ఓపెనింగ్‌ తెచ్చుకుంది. ఓపెనింగ్‌ వీకెండ్‌లో పదకొండు కోట్లకి పైగా షేర్‌ సాధించిన ఈ చిత్రం సాయి ధరమ్‌ తేజ్‌ జనాకర్షణని ప్రూవ్‌ చేసింది. అయితే సినిమా నాసిరకంగా వుండడంతో తొలి రోజునుంచీ నెగెటివ్‌ టాక్‌ వినిపించింది. దాని ప్రభావం ఈ చిత్రం వసూళ్లపై వర్కింగ్‌ డేస్‌లో కనిపించింది.

బ్రేక్‌ ఈవెన్‌ పాయింట్‌కి వెళ్లడానికి చాలా దూరంలో వున్న విన్నర్‌కి సెకండ్‌ వీకెండ్‌ చాలా కీలకం. ఈవారం విడుదలైన చిత్రాల్లో విపరీతంగా ప్రభావం చూపించేదేదీ లేకపోవడం విన్నర్‌కి కలిసొచ్చే అంశం. మరి దీనిని వాడుకుని ఈ వీకెండ్‌ని క్యాష్‌ చేసుకోగలదో లేదో అనేది తేలాలి. 

కిట్టు ఉన్నాడు జాగ్రత్త, గుంటూరోడు, ద్వారక అంటూ మూడు చెప్పుకోతగ్గ కొత్త సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో ఏది బెనిఫిట్‌ అవుతుందో మరి. గత వారం విడుదలైన యమన్‌ కమర్షియల్‌ ఫెయిల్యూర్‌ దిశగా సాగుతోంది. బిచ్చగాడు ఫేమ్‌ విజయ్‌ ఆంటోని మళ్లీ ఆ మ్యాజిక్‌ని రిపీట్‌ చేయడంలో వరుసగా రెండోసారి విఫలమయ్యాడు. ఘాజీ విజయాన్ని అందుకుని రాణాకి సోలో హీరోగా ఫస్ట్‌ హిట్‌ ఇచ్చింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?