Advertisement

Advertisement


Home > Movies -

ఈవారం ట్రేడ్‌ టాక్‌

ఈవారం ట్రేడ్‌ టాక్‌

అంచనాలని తలకిందులు చేస్తూ అజ్ఞాతవాసి అట్టర్‌ఫ్లాప్‌ అయింది. వంద కోట్ల షేర్‌కి తగ్గే ప్రసక్తే లేదని భావించిన చిత్రం కాస్తా యాభై కోట్ల మార్కు దాటడానికి అల్లాడిపోయింది. నూట పాతిక కోట్ల బిజినెస్‌ జరిగిన ఈ చిత్రానికి సగానికి పైగా నష్టం తప్పదని ట్రేడ్‌ చెబుతోంది. తెలుగు సినిమా చరిత్రలోనే అతి పెద్ద డిజాస్టర్‌గా ఈ చిత్రం నిలవనుంది.

అజ్ఞాతవాసి ఫ్లాపవడంతో జైసింహాకి కలిసి వచ్చింది. రికవరీ చాలా తక్కువ కావడం వల్ల, పోటీగా మరో సినిమా లేకపోవడం వల్ల నాసి రకం సినిమా అయినా కానీ జైసింహా పండగని క్యాష్‌ చేసుకుని సేఫ్‌ ప్రాజెక్ట్‌ అనిపించుకునే దిశగా సాగుతోంది. గ్యాంగ్‌ చిత్రానికి టాక్‌ బాగున్నా బిగ్‌ రిలీజ్‌ దక్కలేదు. అయితే మౌత్‌ టాక్‌ వల్ల ఈ చిత్రం నెమ్మదిగా పుంజుకుని సక్సెస్‌ వైపు పయనిస్తోంది.

రంగుల రాట్నం చిత్రం ప్రేక్షకులని మెప్పించడంలో విఫలమైంది. సంక్రాంతి చిత్రాలు ఫెయిలవడంతో ఎంసిఏకి కలిసొచ్చింది. సంక్రాంతి సినిమాలకి భయపడి ఒక వారం గ్యాప్‌ వదిలేయడం వల్ల మరో వీకెండ్‌ని క్యాష్‌ చేసుకునే అవకాశం వాటికి దక్కింది. ప్రతి ఏడాది సంక్రాంతికి కళకళలాడిపోతూ వస్తోన్న బాక్సాఫీస్‌ ఈసారి వెలవెలబోయింది. పట్టుమని వంద కోట్ల బిజినెస్‌ అయినా జరగకపోవడంతో మార్కెట్‌ డల్‌ అయిపోయింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?