Home > Politics - Gossip
బ్రహ్మా ఓడితే బాబుకు ఎడ్వాంటేజీ.. ఎలాగంటే?

ఏదో మంత్రులు మొత్తం నంద్యాలలో తిష్టవేసి.. ప్రచారాన్ని నడిపిస్తున్నట్లుగా వ్యవహారం కనిపిస్తోంది గానీ.. తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయాన్ని నిజంగానే సీరియస్ గా తీసుకుంటున్నదా? లేదా? అనే అనుమానాలు కొందరిలో పొడసూపుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గానీ, ఆయన కొడుకు లోకేష్ గానీ.. ఏదో చాలా రోజుల కిందట ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు వచ్చిపోవడం మినహా పట్టించుకోలేదు. తామే గెలుస్తాం అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు తప్ప.. గెలవడం గురించి పెద్దగా పాటుపడుతున్నట్లు లేదు. 

అయితే రాజకీయ వర్గాల్లో ఒక వెరైటీ కోణం నుంచి, ఆసక్తి కరమైన విశ్లేషణ కూడా నడుస్తోంది. నంద్యాల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం అనేది ఒక రకంగా చంద్రబాబునాయుడుకు ఎడ్వాంటేజీ అవుతుందని కూడా కొందరు వాదిస్తున్నారు. ఒకే ఒక్క ఇబ్బంది ఏంటంటే.. రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు పట్ల పెరుగుతున్న జన వ్యతిరేకతకు ఇది నిదర్శనం అని ప్రతిపక్షం అంటుందనే వాదన తప్ప... చంద్రబాబుకు పోయేదేం లేదనేది కొందరి విశ్లేషణ.

ఎందుకంటే.. ఈసారికి ఓడిపోతే.. వచ్చే ఎన్నికల సమయానికి భూమా బ్రహ్మానందరెడ్డి సిటింగ్ ఎమ్మెల్యే కోటాలో.. పూర్తిగా పాతుకుపోతాడు. అలా జరగడం చంద్రబాబుకు ఇష్టంలేదట. ఈ నియోజకవర్గంలో ముస్లింలకు టికెట్ ఇచ్చి.. తన ముస్లిం ప్రేమను చాటుకోవాలని అనుకుంటున్నారుట. 

ఆ రకంగా ఇప్పుడు బ్రహ్మా గెలవడం భవిష్యత్ స్కెచ్ కు ఇబ్బంది అనుకుంటున్నారనేది ఒక వాదన. అలాగే.. భూమా కుటుంబానికి పెద్దగా ఫేవర్ చేయడం చంద్రబాబుకు అంత ప్రియమైన విషయం కాదని, భూమా నాగిరెడ్డి మరణం నేపథ్యంలో విమర్శలు రాకుండా అఖిలప్రియకు మంత్రిపదవి  ఇచ్చారే తప్ప.. మరోటి కాదని కొందరు అంటున్నారు.

ఆ లెక్కన ఈ ఎన్నికలో బ్రహ్మానందరెడ్డి ఓడిపోతే గనుక.. నంద్యాలలో భూమా కుటుంబానికి బలం ఏమీలేదని తేల్చేసి... పార్టీలో వారి ప్రాధాన్యానికి కోత పెట్టాలని కూడా చంద్రబాబునాయుడు అనుకుంటుండవచ్చునని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి ప్రస్తుతానికి ఒక్క ఎమ్మెల్యే సీటు అత్యవసరంగా కావాలన్న ఆవశ్యకత ఎంతమాత్రమూ లేదు. ఆ నేపథ్యంలో.. ఎన్నికపోతే పోయింది.. రాజకీయంగా.. కిట్టని వారిని తొక్కేయడానికి మంచి అవకాశం చిక్కుతుందని తెదేపా అధినేత ఊహిస్తుండవచ్చునని కూడా పలువురు అంటున్నారు.