Home > Politics - Gossip
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరో ఎంపీ టీడీపీలోకి?

ఆది నుంచి అనుమానాలు రేకెత్తిస్తున్న కర్నూలు ఎంపీ బుట్టా రేణుక.. వైకాపాకు వీడ్కోలు పలికేలానే ఉంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్ని గంటల్లోనే తెలుగుదేశం అధినేతతో సమావేశం అయి వార్తల్లోకి వచ్చిన రేణుక.. వైకాపాను వీడి తెలుగుదేశంలో చేరేలా ఉంది. ఈమె వ్యవహరణ తీరే ఈ అభిప్రాయాలను కలిగిస్తోంది. కర్నూలు జిల్లా పర్యటలో ఉన్న నారా లోకేష్ బాబుతో రహస్యంగా సమావేశం అయ్యారు రేణుక.

మరి ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో లోకేష్ బాబుతో ఒక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సమావేశం కావడం అంటే.. అది కచ్చితంగా ప్రముఖమైన అంశమే. అందునా నంద్యాల ఉప ఎన్నికల వేళ ఈమె లోకేష్ బాబుతో సమావేశం అయ్యారు. చంద్రబాబుతో సమావేశం అయ్యుంటే.. అది డెవలప్ మెంట్ ప్రోగ్రామ్స్ గురించి చర్చించడానికి అని చెప్పుకోవచ్చు. లోకేష్ తో సమావేశం కావడం అంటే ఇది అనుమానించాల్సిన అంశమే.

ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల సమావేశానికి కూడా బుట్టా రాలేదు. ఈ కార్యక్రమానికి వైకాపాలో ఇప్పటి వరకూ మిగిలిన ఎంపీలు వచ్చినా రేణుక మాత్రం రాలేదు. నిన్న లోకేష్ తో సమావేశం కావడం, నేడు జగన్ తో సమావేశానికి గైర్హాజరు కావడాన్ని పోల్చి చూసుకొంటే.. రేణుక జంపే అని అనుకోవాల్సి వస్తోంది. ఇప్పటి వరకూ కూడా పార్టీతో రేణుక అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తోంది. ఈమె వైకాపాలో ఇన్నాళ్లు ఉంటుందని కూడా ఎవ్వరూ అనుకోలేదు.

తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఈమె చంద్రబాబుతో సమావేశం అయ్యింది కూడా. అయితే ఎందుకో టీడీపీలో చేరలేదు. అయినప్పటికీ ఈమెను జగన్ పెద్దగా విశ్వాసంలోకి తీసుకోలేదని స్పష్టం అవుతూనే ఉంది. వచ్చే ఎన్నికల్లో కర్నూలు ఎంపీగా ఈమెకు ఛాన్స్ ఇచ్చేది లేదని జగన్ స్పష్టం చేసినట్టుగా ఇది వరకే వార్తలు వచ్చాయి. ఈమెను ఎమ్మెల్యేగా పోటీ చేయమని అంటున్నాడు కానీ, ఎంపీ టికెట్ ఇవ్వనని జగన్ స్పష్టం చేశాడట.

ఈ విషయంపై రేణుక ‘సాక్షి’ టీవీ వేదికగానే స్పందించింది. తను మళ్లీ ఎంపీగానే పోటీ చేయాలని అనుకుంటున్నానని ఈమె కుండబద్ధలు కొట్టింది. అయితే రేణుకను జగన్ నమ్మడం మానేసి చాలా కాలం అయ్యింది. ఈమెకు ఎంపీగా ఛాన్స్ మళ్లీ ఇచ్చేది లేదని స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో రేణుక తెలుగుదేశం వైపు చూస్తున్నట్టు సమాచారం. తాజా పరిణామాలను బట్టి చూస్తే.. మొన్నటి వరకూ చంద్రబాబును తీవ్రంగా విమర్శించిన రేణుక.. చంద్రబాబును ఆకాశానికెత్తే సమయం వచ్చినట్టుందని స్పష్టం అవుతోంది.