Home > Politics - Gossip
అక్కడ ఈగ వాలితే ఆయన ఊరుకోలేడు

ఆంద్రప్రదేశ్ శాసన సభలో ఇప్పుడు ప్రతిపక్షసభ్యులు లేరు.. అడిగే దిక్కు లేదు.. గట్టిగా ప్రజాసమస్యలపై నిలదీసేవారు లేరు. విపులంగా వెతుకులాడుకుంటూ.. తడుముకుంటూ.. బెదురుతూ.. నదురుబెదురుగా సమాధానం చెప్పాల్సిన అవసరం మంత్రులకు అంతకంటే లేదు. ఇలాంటి విచిత్రమెన పరిస్థితి ఏర్పడిన అసెంబ్లీ సమావేశంలో చంద్రబాబునాయుడు మాత్రం తమ పార్టీ సభ్యులే ప్రతిపక్షం లాగా వ్యవహరిస్తూ ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించాలంటూ ఒక స్టాండర్డ్ ఇంస్ట్రక్షన్స్ ముందే ఇచ్చేశారు.

అయితే ఇక్కడ చిన్న మతలబు కనిపిస్తోంది.. తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రశ్నలు సంధించాల్సి వచ్చినప్పుడు ఎడాపెడా అటు తెలుగుదేశం పార్టీ మంత్రులకు.. ఇటు భారతీయ జనతా పార్టీ మంత్రులకు శాఖలతో నిమిత్తం లేకుండా తాము ప్రస్తావించదలుచుకున్న సమస్యలను మాత్రమే హైలైట్ చేస్తూ ప్రశ్నలు సంధిస్తూ వస్తున్నారు.  
అదే సమయంలో తెలుగుదేశం పార్టీ మంత్రులు ప్రశ్నలపై సజావుగా సమాధానాలు చెబుతున్నారు గానీ.. భారతీయ జనతా పార్టీ మంత్రుల విషయానికి వచ్చే సరికి వాళ్లలో తడబాటు చాలా స్పష్టంగా కనిపిస్తుంది.

తెలుగుదేశం ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ఎంత ఇబ్బంది ఉంటుందో భారతీయ జనతా పార్టీకి ఇప్పుడిప్పుడే అర్ధమవుతూ ఉంటుంది. ఇన్నాళ్లూ వెకాపా ప్రశ్నలు సంధిస్తూ ఉంటే కూడా అన్నింటికీ ఎడతెరిపి లేకుంగా సమాధానాలు చెప్పగలిగాన వాళ్లు కూడా తెదేపా సభ్యులే ఆ ప్రతిపక్ష పాత్రలోకి వచ్చేసరికి సమాధానాలు చెప్పలేకపోతున్నారు. దీనికి సంబంధించి కల్తీలపై సభ్యులు ఎడాపెడా ప్రశ్నలు సంధింస్తూ ఉంటే..  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ సమాధానాలకోసం వెతుకులాడడం తడబడడం సభలో కనిపించింది.

అయితే ప్రభుత్వంలోని మంత్రి కామినేని శ్రీనివాస్ భారతీయ జనతా పార్టీకి చెందిన వాడు కావడంతో ఆయన సమాధానాలకోసం తడబడుతూ ఉంటే.. వెంటనే ఆయనకు మద్దతుగా భాజపా నాయకులు పూనుకున్నారు. తెలుగుదేశం సభ్యులు సంధిస్తున్న ప్రశ్నలు భారతీయ జనతా పార్టీకి చెందిన మంత్రిని ఇబ్బంది పెట్టేసరికి భారతీయ జనతా పార్టీ ఎమ్యెల్యేలు వెంటనే ఆయనకు రక్షణ కవచంలా నిలిచే ప్రయత్నం చేశారు. 

కల్తీల విషయంలో మంత్రిని తెదేపా మంత్రులు నిలదీస్తూ ఉంటే బీజీపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మధ్యలో జోక్యం చేసుకుంటూ.. ప్రభుత్వం అవసరమైన స్థాయిలో తనిఖీ కేంద్రాలను, కల్తీ పరిసోధన కేంద్రాలను ఎర్పాటు చేయకపోతే మంత్రి గారు మాత్రం ఎంచేస్తారు అంటూ అడ్డగోలుగా సమర్దించే ప్రయత్నం చేశారు.

అయినా ఇంతకాలం సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్న తర్వాత.. బీజీపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఉద్దేశంలో ప్రభుత్వం అంటే ఎవరు..? మంత్రి గారు కాదా..? ఎయే పరిసోధన కేంద్రాలకు తనిఖీ కేంద్రాలకు అయితే కొరత ఉన్నదో వాటిని ఎర్పాటు చేయడంలో జగు చేస్తున్నది ఎవరు..? ఆ బాధ్యత మంత్రి గారిది కాదా..? పరిశోధన కేంద్రాలను ఎర్పాటు చేసే ప్రభుత్వం మరోకటి ఉంటుందా..? దాని నిర్వహణ మాత్రం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చూస్తారా..? ఇలాంటి ప్రశ్నలు ఆయనను అడిగే దిక్కు లేదు. తమ పార్టీ వారు గనుక అడ్డగోలుగా సమర్ధించుకోవడం తప్పితే.. ప్రాక్టికల్‌గా ప్రజాసమస్యలు పరిష్కరించే ఉద్దేశంతో కాకుండా.. బీజేపీ ఎమ్మేల్యేలు మాట్లాడినట్లుగా కనిపిస్తోంది.