Home > Politics - Gossip
ఇదో రకం బూమరాంగ్

జగన్ కు ఏదైనా జరిగితే, మనం చంకలు గుద్దేసుకుని రాయడంలో ముందుంటాయి కొన్ని పత్రికలు. జగన్ తన పాదయాత్ర కోసం కోర్డు హాజరుకు మినహాయింపు ఇవ్వమని కోరితే, కోర్డు నిరాకరించింది. కోర్డు నిర్ణయానికి దాని కారణాలు దానికి వుంటాయి. అదంతా ఇక్కడ ఇప్పుడు అప్రస్తుతం. అది కాదు ఇక్కడ విషయం. అప్పుడు కోర్టు ఏవిదంగా నిలదీసిందీ, ఏ విధంగా అభ్యంతరాలు చెప్పిందీ, ఆఖరికి ఏ విధంగా నిర్ణయం వెలువడిందీ అన్నది పెద్దగా ప్రచురించారు.

ఇప్పుడు ఆంధ్రజ్యోతి ప్రచురణ కర్త రాధాకృష్ణకు అదే పరిస్థితి ఎదురయింది. ఓ ఢిఫర్ మెషన్ కేసులో ఆయన కోర్టుకు హాజరు కావడం లేదు. జగన్ అలా కాదు, ప్రతి వారం హాజరవుతూ, పాదయాత్రకు మినహాయింపు అడిగారు. కానీ ఈయన అలాకాదు, అసలు హాజరు కావడం లేదు. దాంతో సిటీ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కచ్చితంగా ఈ సారి హాజరు కావాలని ఆదేశించింది.

సరే ఇంతకీ రాధాకృష్ణ హాజరు కాకపోవడానికి ఆయన తరపున న్యాయవాది చెప్పిన కారణం ఏమిటంట.. అసెంబ్లి సెషన్ కవరేజీల పనిలో బిజీగా వున్నారట. భలేగా వుందిగా? ప్రచురణ కర్తగా ఆయన అసెంబ్లీ రిపోర్టింగ్ కు వెళ్తారా? దానికి రిపోర్టర్లు వుంటారు. పోనీ అసెంబ్లీ వార్తలను ఎడిట్ చేస్తారా? దానికి సబ్ ఎడిటర్లు వుంటారు. పోనీ వార్తల ప్లేస్ మెంట్ డిసైడ్ చేస్తారా? దానికి ఎడిటర్ వుంటారు. రాధాకృష్ణ పబ్లిషర్ గా బిజీ కావచ్చు. జర్నలిస్ట్ గా అని మాత్రం అనుకోవడానికి ఆస్కారం తక్కువే.

ఇప్పడు ఇంతకీ ఈ సారి ఈ కోర్టు ప్రొసీడింగ్స్ అంతా, జగన్ విషయంలో రాసినట్లు డిటైల్డ్ గా రాస్తారంటారా?