Advertisement


Home > Politics - Gossip
హవ్వ... సంక్షోభ పరిష్కారానికి జైట్లీనా?

అరుణ్ జైట్లీ అంటే ప్రస్తుతానికి కేంద్రమంత్రి కావొచ్చుగానీ.. స్వతహాగా ఆయన ఒక న్యాయవాది. సుప్రీం కోర్టులో కేసులు వాదిస్తుంటారు. తాము వాదించేకేసులకు నిమిషాలకు- లక్షల వంతున గణించి ఫీజులు తీసుకునే అతిపెద్ద న్యాయవాదుల్లో అరుణ్ జైట్లీ ఒకరని ఆ వర్గాల్లో చెప్పుకుంటూ ఉంటారు.

అలాంటి అరుణ్ జైట్లీ ఇప్పుడు కేంద్రమంత్రి పదవిలో ఉండొచ్చు గాక.. కానీ న్యాయవ్యవస్థలో ఏర్పడిన సంక్షోభం నేపథ్యంలో.. దాని పరిష్కారానికి ఆయన రంగంలోకి దిగడం ఏ రకంగా సబబు అనే సందేహం ప్రజలకు కలుగుతోంది. చీఫ్ జస్టిస్, మరో నలుగురు సుప్రీం న్యాయమూర్తుల మధ్య సంక్షోభం ఏర్పడినప్పుడు వివాద పరిష్కారానికి అరుణ్ జైట్లీ రంగంలోకి దిగినట్లుగా.. తెర వెనుక ప్రయత్నాలు సాగుతున్నట్లుగా.. ఇరు పక్షాలతోను మాట్లాడినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో ఒక వేళ ఓటమి పాలైతే.. ప్రభుత్వంలోకి రాలేకపోతే.. అరుణ్ జైట్లీ మళ్లీ మళ్లీ సాధారణ సుప్రీం కోర్టు న్యాయవాదిలాగా ప్రాక్టీసు చేసుకునే వ్యక్తే. అలాంటిది ఇవాళ ఆయన సుప్రీం న్యాయమూర్తుల మధ్యవి వాద పరిష్కారానికి మధ్యవర్తిత్వం చేస్తే.. రేపు సుప్రీం న్యాయమూర్తుల ఎదుట ఆయన న్యాయవాదిగా నిల్చున్నప్పుడు.. వారి మీద ప్రభావం ఉండదా? గతంలో వివాదం తీరడానికి ఉపకరించిన నాయకుడిగా ఆయనను గౌరవించి.. న్యాయంతో నిమిత్తం లేకుండా ఆయన వాదించేకేసులకు అనుకూలంగా తీర్పులు వచ్చేలా ప్రభావం పడదనే గ్యారంటీ ఏమిటి... ఈ తరహా సందేహాలు ప్రజలకు కలుగుతున్నాయి.

కానీ.. ఈ విషయంలో ప్రజలకు కలుగుతున్న సందేహం మరొకటి కూడా ఉంది. నలుగురు న్యాయమూర్తులు కలిసి సుప్రీం చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా మీద మాత్రమే తమ విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టి ఉండవచ్చు. ఆయన వ్యవహార సరళి సవ్యంగా న్యాయబద్ధంగా లేదనే ఆరోపణలు చేసి ఉండవచ్చు. కానీ ఇది న్యాయవ్యవస్థ స్వతంత్రతకు సంబంధించిన విషయంగా, స్వతంత్రతకు  కలుగుతున్న హానిగా వారు అభివర్ణించారు.

పరోక్షంగా వ్యవస్థ ఇలా భ్రష్టు పట్టడానికి కేంద్రప్రభుత్వం ప్రమేయం ఉన్నదనే సంకేతాలు ఇచ్చారు. మోడీ సర్కారు మీద ఆరోపణలు లేవుగానీ.. వారి పరువు కూడా బజార్న పడే అవకాశం ఉందనేది పలువురు విశ్లేషకుల భావన. ఇలాంటి నేపథ్యంలో..  పరిస్థితి అంతవరకు రాకుండా.. ఈ సంక్షోభంలో ప్రభుత్వానికి కూడా పాత్ర ఉందనే సంగతి ప్రజలు గుర్తించడానికి ముందే.. దీన్ని సద్దుమణిగేలా చేయడానికే .. లౌక్య కౌటిల్య నీతిలో ఉద్ధండుడైన జైట్లీని మోడీ రంగంలోకి దించినట్లుగా కనిపిస్తోంది.