Advertisement


Home > Politics - Gossip
సెవెన్త్ గేర్ లో కత్తి మహేష్!

సాధారణంగా మనిషికి 5సెన్సెస్ ఉంటాయి. వీటికి అందకుండా అతనికి తెలిసే వ్యవహారాల్ని సిక్స్త్ సెన్స్ అని వ్యవహరిస్తాం. దీనికి కూడా అందని పోకడ ఉంటే దానిని సెవెన్త్ సెన్స్ అంటూ సినిమా తీశారు. అలాగే కారు వాహనం వేగం పుంజుకోవడానికి 5గేర్లు ఉంటాయి. అతి వేగం పుంజుకోవడానికి కొన్ని కార్లలో సిక్స్‌త్ గేర్ కూడా ఉంటుంది.. మరి సెవెన్త్ గేర్ లో వెళ్లాంటే ఎలా..? ఆ విషయం కత్తి మహేష్ ను అడిగితే సరిపోతుంది.

ఎందుకంటే ఆయన ఇప్పుడు పవన్ కోటరీ మీద సాగిస్తున్న యుద్ధంలో సెవెన్త్ గేర్ లోనే దూసుకెళ్తున్నాడు. ఆదివారం నాడు ఇళ్లలో ఖాళీగా కూర్చున్న వాళ్లందరికీ.. పూర్తి స్థాయి వినోదం అందించడానికి టీవీ న్యూస్ ఛానెళ్లు సమస్తం కత్తి మహేష్ వివాదం చుట్టూ తమ బులెటిన్లను ప్లాన్ చేసుకోవడమే ఇందుకు నిదర్శనం.

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు ఓపెన్ సవాలు విసిరి కత్తి మహేష్ హైదరాబాదులోని ప్రెస్ క్లబ్ కు వచ్చి అక్కడ పెట్టిన ప్రెస్ మీట్ ఉద్రిక్త పరిస్థితుల మధ్య ముగిసింది. అక్కడకు పవన్ ఫ్యాన్స్ కూడా రావడం, కత్తి మహేష్ ఫ్యాన్స్, మద్దతుదారులు కూడా రావడం.. ఇరువర్గాల తోపులాటల మధ్య పోలీసులు దాన్ని ముగింపజేశారు.

అయితే తన సవాలును స్వీకరించి పవన్ గానీ, పూనం కౌర్ గానీ చర్చకు రాలేదని కత్తి మహేష్ ఎద్దేవా చేశారు. పవన్ రాజకీయ వైఫల్యం మాత్రమే తాను ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేకపోవడాన్ని తప్పుపట్టారు.

మొత్తానికి పవన్ కల్యాణ్- కత్తి మహేష్ మధ్య రగడలో పూనం కౌర్ ఇరుక్కున్నట్లుగా కనిపిస్తోంది. పవన్ ను సమర్థించే మాట చెప్పినందుకు ఆమెను వివాదంలోకి లాగిన కత్తి.. పవన్ మోసం చేస్తే ఆమె ఆత్మహత్యకు యత్నించిందని, గుడిలో పవన్ కల్యాణ్ గోత్రమే చెప్పి.. తమ ఇద్దరి పేరిట పూజలు చేయించిందని, త్రివిక్రమ్ తో కలిసి పవన్ కల్యాణ్ క్షుద్ర పూజలు చేయించిన చోట పూనం కూడా ఉన్నదని, ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ హోదా పవన్ వల్లనే ఆమెకు వచ్చిందని ... పలు అనుమానాలు రేకెత్తించేలా ఆరు ప్రశ్నలు సంధించారు.

ప్రెస్ మీట్ అర్థంతరంగా ముగిసిన తర్వాత.. కత్తి మహేష్ పలు టీవీ ఛానెళ్ల ద్వారా రోజంతా ఈ వ్యవహారంపై చర్చోపచర్చల్లోనే పాల్గొంటూ ఏమాత్రం ఘాటు తగ్గకుండా పవన్ కల్యాణ్, ఆయన అనుచర వర్గం మీద విరుచుకుపడుతూనే ఉండిపోయారు.