Home > Politics - Gossip
కేంద్రంపై కేటీఆర్ పంచ్

కేటిఆర్ భలే పంచ్ పడేసారు. కేంద్రం వైఖరిపై నిర్మొహమాటంగా, అసెంబ్లీ సాక్షిగా ఆయన ఘాటు విమర్శ చేసారు. రుణమాఫీ వ్యవహారంపై ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలను రెండేళ్ల క్రితం కేంద్రం ఎలా ఇరుకున పెట్టిందో తెలిసిందే. ఇటు కేంద్రం కానీ, అటు రిజర్వ్ బ్యాంక్ కానీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదుకోవడానికి ముందుకు రాలేదు. ప్రతిపక్షాలు మాత్రం ఈ రుణమాఫీ హామీపై నానా యాగీ చేసాయి.ఆఖరికి వాయిదాల పద్దతిలో రుణమాఫీ చేసుకుంటూ వస్తున్నారు.

ఇదే విషయం తెలంగాణ అసెంబ్లీలో చర్చకు వచ్చింది. రైతు రుణమాఫీ చేస్తున్న తీరు, కేటాయిస్తున్న నిధులపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని కార్నర్ చేసే ప్రయత్నం చేసాయి. అప్పుడు కేటీఆర్ లేచి సరైన సమాధానం ఇచ్చారు. ‘ 2014లో ప్రభుత్వం ఏర్పాటైనపుడు రుణమాఫీ పై ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్, కేంద్రం బోలెడు నీతులు చెప్పాయి. నీతి వాక్యాలు వల్లె వేసాయి. దీనివల్ల చాలా ఆర్థిక, క్రమ శిక్షణ సమస్యలు వస్తాయని చెప్పారు. కానీ ఇప్పుడు తీరా యుపి ఎన్నికలు వచ్చేసరికి కేంధ్రంలో వున్న భాజపానే రుణమాఫీ ప్రకటించింది’ అంటూ కేటిఆర్ ఎద్దేవా చేసారు. దీంతో ప్రతిపక్షాల నోట మరి మాట లేకపోయింది.