Advertisement


Home > Politics - Gossip
నంద్యాల ఫలితం సూఛాయగా అర్థం అవుతోంది..!

నంద్యాల బైపోల్స్‌ విషయంలో తెలుగుదేశం పార్టీ వర్గాలు, ఆ పార్టీ అనుకూల మీడియా వర్గాలు అనుసరిస్తున్న వ్యూహాలు కొన్ని పాత వ్యవహరాలనే గుర్తు చేస్తూ ఉండటం గమనార్హం. శిల్పా మోహన్‌ రెడ్డి నామినేషన్‌ తిరస్కరణకు గురి అవుతుందని... తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా చేసిన హడావిడిని చూస్తే.. కడప బైపోల్స్‌, పద్దెనిమిది స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల పరిణామాలను గుర్తు చేస్తున్నాయి. అప్పుడు కూడా అచ్చం ఇలాగే... నానా హడావుడి చేశారు.

శిల్పా మోహన్‌ రెడ్డి నామినేషన్‌ తిరస్కరణకు గురి కానున్నదని తెలుగుదేశం అనుకూల మీడియా వర్గం హడావుడి చేస్తూ.. ఎంత వరకూ వెళ్లిందంటే.. ఈ ఎన్నికల్లో ఇక వైకాపాకు దిక్కేలేదు అని.. గొట్టం ముందు పెట్టుకుని ఒక ఛానల్‌ రిపోర్టర్‌ తేల్చి చెప్పాడు. శిల్పా మోహన్‌ రెడ్డి నామినేషన్‌ తిరస్కరణకు గురికానుంది, కాసేపట్లో ఈసీ ఆ ప్రకటన చేయనుంది.. కేవలం శిల్పా మోహన్‌ రెడ్డిదే కాదు, వైకాపా తరపున దాఖలైన రెండో నామినేషన్‌ అంటే, శిల్పా మోహన్‌ రెడ్డి తనయుడు దాఖలు చేసిన నామినేషన్‌ కూడా తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది.. అని ఆ ఛానల్‌ రిపోర్టర్‌ తేల్చి చెప్పాడు.

మరి ఇప్పుడు వైకాపా ఏం చేయబోతోంది? అని స్టూడియో నుంచి ఉత్సాహమైన ప్రశ్న. దీనికి 'ఏముంది.. కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతు ప్రకటించాలి, లేదంటే.. ఈ ఎన్నిక నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్టుగా ప్రకటన చేయాలి..' అని సదరు రిపోర్టర్‌ తేల్చేశాడు! అయినా వీళ్ల మేధస్సుకు జోహార్లు పలకొచ్చు. వీళ్లకు ఎలా వస్తాయో కానీ ఈ ఐడియాలు.. గ్రేట్‌! కానీ ఈ విష ప్రచారానికి కేవలం రెండుగంటల సమయం మాత్రమే దొరికింది పాపం! తర్వాత ఈసీ స్పష్టతను ఇచ్చింది.

అయితే ఇది కొత్తేంకాదు, గతంలో ఇంతకంటే చిత్ర విచిత్రాల ప్రచారం చేసి పెట్టారు తెలుగుదేశం వాళ్లు. జగన్‌ నామినేషన్‌ తిరస్కరణ అయ్యే అవకాశం ఉందని, కడప ఉప ఎన్నికలప్పుడు ప్రచారం చేశారు. అలాగే వైకాపాలో చేరిన 18మంది ఎమ్మెల్యేలకూ మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండకపోవచ్చు.. ఈసీ వారిపై నిషేధం విధించే అవకాశం ఉంది, పార్టీ ఫిరాయించినందుకు గానూ.. అది జరగొచ్చు.. అని 18 స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు శిల్పా మోహన్‌ రెడ్డి నామినేషన్‌ విషయంలో అలాంటి ప్రచారమే అందుకున్నారు.

తెలుగుదేశం పార్టీ ఫ్రస్ట్రేషన్‌ పీక్‌ స్టేజీలకు చేరినప్పుడు ఇలాంటి ప్రచారాన్ని చేస్తూ ఉంటారు. నంద్యాల బైపోల్‌ విషయంలో కూడా అచ్చం అలాగే జరుగుతోంది. టీడీపీ ట్రూపులోని ఈ ఫ్రస్ట్రేషన్‌ లెవల్స్‌ను బట్టి.. ఫలితం ఎలా ఉండబోతోందో సూఛాయగా అర్థం చేసుకోవచ్చు.