Home > Politics - Gossip
నాన్న, నేను.. తెలుగుదేశం పార్టీ.!

ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనే శ్రమ లేకుండా నామినేటెడ్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవినిచ్చావ్‌.. అనుభవం లేకపోయినా మంత్రి పదవి ఇచ్చావ్‌.. అన్నిటికీ మించి, పార్టీ జాతీయ ప్రధాని కార్యదర్శిగా అవకాశమిచ్చావ్‌.. నాన్నా, అందుకే ఐ లవ్‌ యూ.! హ్యాపీ ఫాదర్స్‌ డే.. ఇదీ నారా లోకేష్‌ మనోగతం కావొచ్చు. కావొచ్చేంటి.? అదే నిజం. 

తెలంగాణలోనే టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, తన కుమారుడికి మంత్రి పదవి ఇచ్చారు. కానీ, తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్‌ అత్యంత కీలకంగా పనిచేశారు. పార్టీపై తనదైన ముద్ర వేశారు. మంత్రిగా అవకాశమిస్తే, అటు పార్టీపైనా.. ఇటు పాలనలోనూ తనదైన ముద్ర వేశారు కేటీఆర్‌.

గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల్లో పార్టీని ముందుండి నడిపించారు. కాబట్టి, పుత్రోత్సాహం విషయంలో కేసీఆర్‌కి లోటు లేదు. కేటీఆర్‌ కారణంగా, కేసీఆర్‌కి రాజకీయంగా ఇబ్బందికరమైన పరిస్థితులొచ్చిన సందర్భాల్లేవు. 

కానీ, నారా లోకేష్‌ అలా కాదు. చదువు దగ్గర్నుంచి, మంత్రి పదవి దాకా.. అడుగడుగునా చంద్రబాబుకి రాజకీయంగా నారా లోకేష్‌ కారణంగా చంద్రబాబుకి ఇబ్బందులే. లోకేష్‌ మంత్రి కాకముందు నుంచే ఆయనపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి.

పార్టీలో సీనియర్లు, లోకేష్‌ తీరపై అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు కోకొల్లలు. ఇవి చాలదన్నట్లు, కేటీఆర్‌లా ప్రజాక్షేత్రంలో నారా లోకేష్‌ తానేంటో నిరూపించుకోలేకపోయారు. 

ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదని చంద్రబాబే తన పుత్రరత్నం గొప్పతనం గురించి తెలుసుకున్నారు. చేసేది లేక, నామినేటెడ్‌ కోటాలో 'పెద్దలసభ'కి పంపించేశారు చంద్రబాబు, తన పుత్రరత్నాన్ని. ఇంతగా, తన గురించి కష్టపడ్డ చంద్రబాబుకి నారా లోకేష్‌, హ్యాపీ ఫాదర్స్‌ డే చెప్పకపోతే ఎలా.? తండ్రి నుంచి నారా లోకేష్‌ ఇంకా చాలా చాలా నేర్చుకోవాలి.

జేబులో రూపాయి లేకుండా ఎలా రాజకీయం చేయాలో లోకేష్‌ నేర్చుకోవాలి. వ్యక్తిగత ఆస్తులు వేరు, కుటుంబ ఆస్తులు వేరు.. అని జనాన్ని నమ్మించడం తెలుసుకోవాలి. అన్నిటికీ మించి, గురివింద చందాన నేను 'నిప్పు' అని బుకాయించడమూ అలవరచుకోవాలి. కాదంటారా.?