Advertisement


Home > Politics - Gossip
చంద్రబాబు కోసం ఒక సరికొత్త డిజిగ్నేషన్!

చంద్రబాబునాయుడు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. గతంలో కూడా ఆయన తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిత్వం నెరపారు. మళ్లీ అదే పోస్టులో ఉన్నారు. ఆ పోస్టు తనది అని ఆయన అనుకుంటారు. తనకు ఉన్నదానికంటె ఇతర వాటి మీదే జనరల్ గా అందరికీ ఆసక్తి ఎక్కువకదా! చంద్రబాబుకు కూడా సీఎం పోస్టు కంటె ఇతర డిజిగ్నేషన్ లు రుచికరంగా అనిపిస్తాయి.

గతంలో తొమ్మిదేళ్లు పాలన సాగించిన రోజుల్లో ఆయన తనను అందరూ ‘సీఈఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ అని పిలవాలని ముచ్చట పడేవారు. అంతటి కార్పొరేట్ స్టయిల్లో తాను ప్రభుత్వాన్ని నడుపుతున్నానని ఆయన ఫీలింగన్నమాట. మరి ఈ దఫా ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ఆయన ఏపీ రాష్ట్రానికి ‘మార్కెటింగ్ మేనేజర్’ డిజిగ్నేషన్లోకి వచ్చారు.

ఏపీలో పెట్టుబడులు పెట్టండి .. లాభాలు చాలా వస్తాయి అని చెప్పుకుంటూ ప్రపంచం మొత్తం టూర్లు చేస్తూ ప్రమోషన్ వర్క్ చేస్తున్నారు గనుక.. ఆ డిజిగ్నేషన్ కూడా ఆయనకు ఇంపైనదే కావొచ్చు. ఇప్పుడు ఏపీలోను, అమరావతిలోను రాబోయే కొత్త నిర్మాణాలకు ‘కన్‌స్ట్రక్షన్ కన్సల్టెంట్’ గా కూడా మరో సరికొత్త డిజిగ్నేషన్ లోకి చంద్రబాబునాయుడు ప్రవేశిస్తుననట్లుగా కనిపిస్తోంది.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఆయన ఇప్పటికే కన్సల్టెంటుగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రాజెక్టు, అందుకు వెచ్చించే సొమ్ములు అన్నీ కేంద్రానివి అయితే.. నిర్మాణానికి పర్యవేక్షణ బాధ్యత మాత్రం కన్సల్టెంటుగా చంద్రబాబుది. ఆ పాత్రే ఇప్పుడు ప్రాజెక్టు కొంప ముంచుతోంది కూడా.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆయన తాజాగా అమరావతి నగరంలో వచ్చే ప్రెవేటు భవనాలకు కూడా ఆయనే కన్సల్టెంటు కాబోతున్నారా అనే సందేహాలు ప్రజల్లో కలుగుతున్నాయి. ప్రభుత్వ భవనాలకు డిజైన్లను తను చూడడం ఓకే చేయడం తన అధికారం గనుక.. ఆ మిషమీద ఆయన ఏ డిజైనునూ ఓకే అనకుండా, ఏ పనినీ ప్రారంభించకుండా ఏళ్లూ పూళ్లూ గడిపేస్తున్నారు.

అయితే ప్రెవేటు భవనాలు అనగా.. ప్రెవేటు యూనివర్సిటీలకు కేటాయించిన స్థలాల్లో భవనాల డిజైన్లను ఆయనే పరిశీలించి తానే ఆమోదిస్తూ.. అక్కడ కట్టే ప్రతి ప్రెవేటు భవనం కూడా ఐకానిక్ గా తిరుగులేని రీతిలో ఆకట్టుకునేలా ఉండాలని హితబోధ చేస్తూ.. తన కన్సల్టెన్సీ సేవలను ప్రెవేటు రంగానికి కూడా విస్తరిస్తున్నారు.

అయినా.. సుదీర్ఘ అనుభవంతో కూడిన 70ఏళ్ల వయసులో బాధ్యతగా ముఖ్యమంత్రి పదవిని నిర్వహించుకోక.. ఇందరి సేవలో ఇన్ని బహుముఖ పాత్రలను పోషించడం ఎందుకు అనే సందేహం ప్రజల్లో కలుగుతోంది మరి!.