Advertisement


Home > Politics - Gossip
చిరంజీవికి తలనొప్పి తెస్తున్న పవన్?

మంచో.. చెడో.. గడిచిపోయింది. ప్రజారాజ్యం పార్టీ అంకం ముగిసిపోయింది. దాన్ని విలీనం చేయడంతో చిరంజీవి భారాన్నిదించేసుకున్నాడు. అందుకు ప్రతిఫలంగా దక్కిన రాజ్యసభ సభ్యుడిగా చిరు కొనసాగుతున్నాడు. ఆ టర్మ్ ముగిస్తే .. మళ్లీ రాజ్యసభ సీటు కోసం కూడా చిరంజీవి గట్టిగా ట్రై చేసే అవకాశాలు కనిపించడం లేదు. ప్రశాంతంగా బ్యాలెన్స్ హీరోయిజాన్ని తెరపై చూపుతూ.. కెరీర్ ను ఎంజాయ్ చేస్తున్నాడు మెగాస్టార్. ప్రయోగాత్మక పాత్రలు.. పేరు తెచ్చే సినిమాలు చేసుకొంటూ పోవాలన్నట్టుగా సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు చిరంజీవి.

ఇప్పుడు చిరంజీవిని రాజకీయంగా విమర్శించే వాళ్లు ఎవ్వరూ లేరు. అసలు చిరంజీవి రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ ఎంపీ అనే విషయాన్ని కూడా ఏపీ రాజకీయంలోని పార్టీలు అస్సలు గుర్తించడం లేదు. ఎంపీగా ఆయన ఏం చేస్తున్నాడు? అని ప్రశ్నించే నాథుడు కూడా లేడు. వ్యక్తిగతం రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా.. కామ్ గా ఉంటూ.. చిరంజీవి అలా సైలెంట్ మోడ్లోకి, సినిమా మూడ్ లోకి వెళ్లిపోయారు. ఆయన ప్రశాంతంగా ఉన్నారు. మరి ఇప్పుడు చిరంజీవి తమ్ముడు, జనసేన అధిపతి పవన్ కల్యాణ్.. ఇప్పుడు అన్నయ్యను మళ్లీ రాజకీయంలోకి లాగుతున్నాడు.

మీడియా ముందుకు వచ్చి పవన్ మాట్లాడుకోవాలంటే బోలెడన్ని విషయాలు ఉన్నాయి. పోలవరం, ప్రత్యేక హోదా, తెలుగుదేశం ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలు, అమరావతిలో ఏం జరుగుతోంది? చంద్రబాబు వరస పెట్టి విదేశీ పర్యటనలు.. ఇలా ఎన్నో ఉన్నాయి. తనకు ఎంతో సోషల్ అవేర్ నెస్ ఉందని స్వయంగా చెప్పుకుంటున్న పవన్ కల్యాణ్ వాటి గురించి మాట్లాడటం లేదు. ప్రజారాజ్యం, పరకాల ప్రభాకర్, అల్లు అరవింద్.. మిత్ర.. అంటున్నాడు. గత ఎన్నికల ముందు ఈ టాపిక్స్ గురించి మాట్లాడి ఉంటే అదో లెక్క. ఇప్పుడు ప్రజారాజ్యం ఏం చేసింది, ఎక్కడకు వెళ్లింది, అనేది కాదు టాపిక్. జనసేన ఏం చేస్తోందనేది.

దీని గురించి చెప్పుకోవడానికి లేక.. పవన్ కల్యాణ్ ప్రజారాజ్యం ప్రసక్తి తెస్తున్నాడు. అన్నయ్యకు మోసం చేసిన వాళ్లపై రీవేంజ్ అంటున్నాడు. మరి గత ఎన్నికల్లో అన్నయ్య కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తే.. పవన్ బీజేపీ, టీడీపీల తరఫున ప్రచారం చేశాడు కదా.. వేరే ఎవరో తన అన్నయ్యను మోసం చేశారని అనడం ఏమిటి? అప్పుడు అన్నయ్య మీద గౌరవం లేదా? ఇప్పుడొచ్చిందా? ఇక ఒక పార్టీని రద్దు చేయడం వేరు, విలీనం చేయడం వేరు.. తమిళనాడులో పొలిటికల్ గా ఫెయిల్ అయిన విజయ్ కాంత్ తనంతకు తను కామ్ అయ్యాడు కానీ.. మరో పార్టీలో విలీనం చేసి.. ఎంపీ గా నామినేట్ కావడం లేదు. మరి చేసిందే అసమర్థమైన పని.

దాన్నంతా మరిచిపోయారు అనుకుంటే.. పవన్ కల్యాణ్ దాన్ని కెళికి మరీ కంపు చేస్తున్నాడు. ఊరందరినీ విమర్శిస్తున్నావు.. ప్రజారాజ్యంతో చిరంజీవిని ఎవరో ద్రోహం చేశారని అంటున్నావు.. వాళ్లు జవాబుదారీ కాదు, 70లక్షల మంది ఓట్లను పొంది.. పార్టీ ని విలీనం చేసిన మీరు కదా.. జనాలను మోసం చేసింది.. అని ప్రత్యర్థులు విరుచుకుపడుతున్నారు. మళ్లీ దీనికి పవన్ వద్ద సమాధానం లేదు.. ఎందుకంటే.. అప్పుడు పవన్ నిస్సహాయుడట!