Advertisement


Home > Politics - Gossip
ప్రెజంటేషన్ సూపర్ హిట్, ప్రాక్టికల్ గా అట్టర్ ఫ్లాప్

ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఎలాంటి ఏలుబడి సాగిస్తున్నదో స్పష్టంగా తెలుసుకోవడానికి.. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ఒక అతిపెద్ద ఉదాహరణ. ఇవాళ అమెరికా అధ్యక్షుడి కూతురు ఇవాంక ట్రంప్ కూడా హైదరాబాదుకు వచ్చి, ప్రధాని కూడా రాబోతున్న తరుణంలో.. అసలు ఈ పారిశ్రామిక వేత్తల సదస్సుకు ఆతిథ్యం ఇచ్చి ఉండాల్సిన అవకాశం తమదేనని.. మిస్సయి ఆంధ్రప్రదేశ్ కు వచ్చిందని ఏపీ సర్కారుకు తమ తైనాతీ మీడియాల రూపంలో మొసలి కన్నీరు కారుస్తోంది.

కానీ.. ఇలాంటి సమయంలో ఇలాంటి ఏడుపులు ఏడవడం ద్వారా.. తమలోని ఓర్వలేని తనాన్ని మాత్రమే ఏపీ సర్కారు బయటపెట్టుకుంటున్నదని ప్రజలు అర్థం చేసుకుంటారు. అంతకు మించి.. ఇలాంటి ప్లాంటెడ్ వార్తా కథనాలతో తాము సాధించేది లేదని వారు కూడా తెలుసుకోవాలి.

పారిశ్రామిక వేత్తల సదస్సు నేపథ్యంలో.. ఇవాళ పత్రికల్లో కొన్ని కథనాలు వచ్చాయి. అసలు ఈ సదస్సుకు విశాఖ వేదికగా ఉండాల్సింది అని, తృటిలో మిస్సయిందని, దాదాపు 2000మంది అతిథులకు ఫైవ్ స్టార్ ఆతిధ్యం కల్పించే అవకాశం లేకపోయినందువల్లనే... విశాఖకు అవకాశం దక్కలేదని కథనం సారాంశం. నిజానికి ఈ సదస్సు నిర్వహణ అవకాశం తమకంటే తమకే దక్కాలని ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రయత్నాలు చేశాయి. కానీ అమెరికా ప్రభుత్వ ప్రతినిధులు అన్ని పరిస్థితులను, అవకాశాలను పరిశీలించిన తర్వాత హైదరాబాదును ఎంపిక చేశారు.

అయితే విశాఖలో నిర్వహించేందుకు ప్రభుత్వం తరఫున అమెరికా వారికి ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చూపించారుట. ప్రజెంటేషన్ వారికి అద్భుతంగా నచ్చిందిట. చాలా ముచ్చట పడ్డారుట. ఆ తర్వాత వచ్చి విశాఖలోని పరిస్థితుల్ని అధ్యయనం చేశాక.. ఆతిథ్యం సాధ్యం కాదని వేదికను హైదరాబాదుకు మార్చారుట... ఇదీ వార్తల సారాంశం. అక్కడికేదో.. హైదరాబాదుకు సమానమైన గొప్పదనం తమకు కూడా ఉన్నదని ఏపీ సర్కారు చాటుకుంటున్నట్లుగా ఉన్నది కానీ.. వాస్తవంలో వారి వైఫల్యమే బయటపడుతున్నది.

ఈ వైనం మొత్తం గమనిస్తే.. ఏపీ సర్కారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లను అద్భుతంగా రూపొందిస్తున్నది గానీ.. వాస్తవంలో రాష్ట్రంలో వసతుల పరంగా అంత సరుకు ఉండడం లేదని తేలిపోతున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రస్తుత పచ్చ మీడియా కథనాల ద్వారా ఏపీ సర్కారే స్వయంగా వెల్లడి చేసుకుంటున్నట్లుగా ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రెజంటేషన్ హిట్ అవుతోంది గానీ.. ప్రాక్టికల్ గా ఏపీ అట్టర్ ఫ్లాప్ అవుతోందని.. ప్రజలను మాయ చేయడానికి మాత్రమే ఇలాంటి టెక్నిక్కులు ఉపయోగపడతాయని పలువురు అంటున్నారు.