Home > Politics - Gossip
పులివెందులలో గంటా అంట

గత కొన్నాళ్లుగా బాబు దగ్గర మంచి మార్కులు సంపాదించుకోవడంలో వెనకపడుతున్నారని వార్తలు వస్తున్నాయి మంత్రి గంటా శ్రీనివాస రావు విషయంలో. అలాంటిది ఒక్కసారిగా ఆయన చంద్రబాబు గుడ్ లుక్స్ లోకి వచ్చేసారు. కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా విజయం సాధించడంతో ఆ నియోజక వర్గం పార్టీ ఇన్ చార్జి మంత్రిగా గంటా శ్రీనివాసరావుకు మార్కులు పడ్డాయి.

అదే సమయంలో విశాఖలో వైఎస్ విజయలక్ష్మి ని ఓడించిన సంగతిని చంద్రబాబు దృష్టికి తెచ్చారట గంటా మంత్రి వర్గ సహచరులు. వైఎస్ కుటుంబ సభ్యులను ఓడించడంలో గంటా హ్యాండ్ బాగుందని, అందువల్ల పులివెందుల లో గంటాను వచ్చే ఎన్నికల్లో నిలబెడితే బెటర్ అని సరదాగా అన్నారట ప్రత్తిపాటి పుల్లారావు అండ్ కో. దానికి బాబు, అయితే ఓకె, ఇప్పుడే పులివెందుల క్యాండిడేట్ గా గంటా శ్రీనివాసరావును ప్రకటించేద్దాం అనేసారట.

ప్రతి ఎన్నికకు నియోజక వర్గం మారతారు గంటా శ్రీనివాసరావు అని పేరుపడ్డారు. మరి అది మరో సారి నిజం చేసేలా ఆ కొస ఉత్తరాంధ్ర నుంచి ఈ కొసన వున్న పులివెందులకు పంపేస్తారా ఏమిటి?