Advertisement


Home > Politics - Gossip
పూనమ్ కౌర్.. ఇన్నాళ్లూ చూస్తూ కూర్చున్నారా?

అనగనగా ఒక పూనమ్ కౌర్.. ఎక్కడో పంజాబీ ఫ్యామిలీ. చాన్నాళ్ల కిందట హైదరాబాద్ వచ్చి సెటిలైన ఫ్యామిలీ. కొన్ని సినిమాలు చేసిందామె. వాటిల్లో ఏవీ చెప్పుకోదగిన సినిమాలు లేవు. చోటా హీరోల సరసన ఫ్యామిలీ టైపు రోల్స్ చేస్తూ వచ్చిన ఆమె.. వినాయకుడు సినిమాలో చిట్టిపొట్టి దుస్తులతో అందరినీ ఆకర్షించింది. అయితే.. అది ఆమె కెరీర్ కు బూస్ట్ కాలేదు. ఆమెను జనాలు మరిచిపోయారు.. అని వేరే చెప్పనక్కర్లేదు.

అలాంటి ఆమెను ఉన్నట్టుండి ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించినట్టుగా పత్రికల్లో వార్తలు వచ్చాయి. తెలుగుదేశం అధికారిక పత్రికలు కూడా విషయాన్ని ధ్రువీకరించాయి. అవతల తెలంగాణలో సమంతను చేనేతకు అంబాసిడర్ గా ప్రకటించిన నేపథ్యంలో.. ఏపీలోనూ ప్రకటించారేమోలే అనుకున్నారంతా. లోపల ఎవరి సిఫార్సుతో ఆమెను నియమించారు.. లోపల లొల్లి ఏంది? అనేది పక్కన పెడితే, ఆమె నియామకం జరిగిందని వార్తలు వచ్చాయి.

అన్ని ప్రముఖ పత్రికల్లోనూ. ఆ పై ఆ హోదాలో ఆమె ఏపీలో పర్యటించింది కూడానండోయ్! చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా ఆమె ఆయా కార్యక్రమాల్లో పాల్గొంది. అందుకు సంబంధించిన వార్తలు కూడా ప్రముఖంగా ప్రచురితం అయ్యాయి. పూనమ్ కౌర్ అధికారిక హోదాలోనే ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నట్టుగా వాటిల్లో ప్రముఖంగా పేర్కొన్నారు.

ఇప్పుడు ట్విస్టు ఏమిటంటే.. అసలు ఏపీలో చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఎవరూ లేరని మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించడం. పూనమ్ కౌర్ ను అంబాసిడర్ గా ప్రకటించినప్పుడు ఈ మంత్రిగారు చేనేత బాధ్యతల్లో ఉండినారు. ఆ తర్వాత మరో శాఖకు వచ్చారు. వివాదాల నేపథ్యంలో ఈయనను కదలిస్తే.. అబ్బే.. ఆమెను మేం నియమించనే లేదు, ఏపీలో అలాంటి హోదానే లేదు, చేనేతకు బ్రాండ్ అంబాసిడరే లేరు అని ఈయన చెప్పుకొచ్చారు.

ఇక్కడ అంతుబట్టని విషయం ఏమిటంటే.. ఒకవైపు ఆమె చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ ను అని చెప్పుకుని తిరుగుతోంది. ఇంత వివాదం రేగినా.. చాలా విషయాల గురించి స్పందించిన ఆమె.. తను చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ నే అన్నట్టుగా రియాక్ట్ అవుతోంది. తనకు అలాంటి హోదా లేదు అని ఆమె చెప్పలేదు, ఆమె సోదరుడు కూడా చెప్పలేదు. ఇవతల మంత్రిగారేమో.. అబ్బే అలాంటి హోదానే లేదు అంటున్నారు.

అంటే.. ఇన్నాళ్లూ పూనమ్ అబద్ధాలు చెప్పుకుని తిరిగినట్టేనా? హోదా లేకున్నా అలా తిరిగిందా? ఇది చట్ట విరుద్ధం కాదా? అంత జరుగుతుంటే.. ఆరేడు నెలలుగా ఏపీ ప్రభుత్వం చోద్యం చూస్తోందా? చేనేత బ్రాండ్ అంబాసిడర్ ను అంటూ ఒక హీరోయిన్ చెప్పుకొంటూ తిరుగుతుంటే.. ఆమెను మేం నియమించనే లేదు.. అని ప్రభుత్వం ఎందుకు రియాక్ట్ కాలేదు? అంటే.. ఎవరు ఏదైనా చెప్పుకుని ప్రచారం పొందవచ్చా? ఇదేనా ఏపీలో సాగుతున్న పాలన?