Advertisement


Home > Politics - Gossip
షర్మిల పోటీ కడప నుంచినే? అందుకేనా?

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్‌ షర్మిల పోటీచేయడం దాదాపు ఖాయమే అనేది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న మాట. 2014 సార్వత్రిక ఎన్నికలు ముగిసిన దగ్గర నుంచి షర్మిల ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా కనిపిస్తున్నారు. అయితే ఇటీవల పార్టీ ప్లీనరీలో పాల్గొన్నారామె. ఈ నేపథ్యంలో ఆమె పోటీపై కూడా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఆమె పోటీ ఖాయమే.. అనేమాట వినిపిస్తోంది. మరి పోటీ ఎక్కడ నుంచి అంటే.. ఈ విషయంలో కొన్ని నియోజకవర్గాల పేర్లు వినిపిస్తున్నాయి.

మల్కాజ్‌గిరి మొదలుకుని, ఖమ్మం వంటి తెలంగాణ ప్రాంత నియోజకవర్గాలు, విశాఖతో పాటు ఒంగోలు ఎంపీ సీటు పేరు కూడా వినిపిస్తోంది. మరి వీటిల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తుంది.. అనే దానిపై ఇంకా క్లారిటీలేదు. ఒంగోలు నుంచి షర్మిల పోటీ చేయవచ్చనే మాట గట్టిగా వినిపిస్తోంది. అయితే.. షర్మిల కడప నుంచి ఎంపీగా పోటీ చేయవచ్చు.. అనేమాట కూడా వినిపిస్తూ ఉండటం విశేషం. ప్రస్తుతానికి అయితే కడప నుంచి వైకాపా ఎంపీనే ఉన్నాడు. అవినాష్‌ రెడ్డి రూపంలో వైఎస్‌ కుటుంబీకుడే ఎంపీగా ఉన్నాడు. మరి ఇలాంటి నేపథ్యంలో షర్మిల ఎందుకు ఇక్కడ తెరపైకి వస్తోంది అంటే.. దాని వెనుక ఆసక్తిదాయకమైన విషయం ఉంది.

అవినాష్‌ రెడ్డిని మార్చాలని జగన్‌ ఫిక్సయ్యాడని సమాచారం. దీనికి కారణం అవినాష్‌ తీరే. అతడు చాలా సౌమ్యుడు! అవును దీంతోనే కడప సీటుకు ఎంపీ అభ్యర్థిని మార్చాలని జగన్‌ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అవినాష్‌ది అంతా పక్కింటబ్బాయి తీరు. ద బాయ్‌ నెక్ట్స్‌డోర్‌ అన్నమాట.. చాలా సౌమ్యంగా, పద్ధతిగా, గౌరవంగా నడుచుకొంటూ.. అవినాష్‌ రెడ్డి కొనసాగుతున్నాడు. ఎక్కడకు వెళ్లినా ఎలాంటి హంగామా ఉండదు, దూసుకుపోయేది ఉండదు, రుబాబు ఉండదు.. ఎస్సైని కూడా 'సార్‌..' అని సంభోదిస్తూ అవినాష్‌ రెడ్డి.. చాలా కూల్‌, కామ్‌గా కొనసాగుతున్నాడు.

మరి ఇదంతా మంచిదే, ఈ విషయాన్ని ఎవరూ కాదనరు. అయితే ఈ రకమైన తీరుతో కేడర్‌ను ఆకట్టుకోలేకపోతున్నాడు అవినాష్‌. ఎంపీ స్థాయి వ్యక్తి నుంచి కొంత దూకుడైన తీరును ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు వాళ్లు. తమ కోసం ఎవరితో అయినా కొట్లాడగలడు.. అనే రేంజ్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌ వాళ్లవి. అందులోనూ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. అవతల నుంచి దాడులు తీవ్రంగా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో కేడర్‌ అవినాష్‌ తీరుతో ఒకింత నిరుత్సాహానికి గురి అవుతోంది.

మంచోడు.. పద్ధతిగా మాట్లాడతాడు.. అయినా, నేటి రాజకీయంలో కొంతదూకుడు అవసరం ఉంది. అందులోనూ.. ఇంతకు ముందు కడప నుంచి ఎంపీగా ఉండిన జగన్‌ అయినా, అంతకు ముందు వివేకానందరెడ్డి అయినా.. అంతకన్నా ముందు వైఎస్‌ అయినా.. కేడర్లోకి దూసుకుపోయారు, స్పష్టమైన భరోసాగా నిలిచారు. వారందరికీ భిన్నంగా ఉంది.. అవినాష్‌ రెడ్డి తీరు. అందుకే ఈ అబ్బాయికి ఏదైనా నామినేటెడ్‌ పోస్టు ఇచ్చేసి, ఎంపీగా మాత్రం మరొకరిని తీసుకురావాలనేది జగన్‌ ఆలోచనగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో షర్మిల పేరును కూడా పరిశీలిస్తున్నట్టుగా సమాచారం.