Advertisement


Home > Politics - Gossip
చంద్రబాబుపై భగ్గుమంటున్న తెలంగాణ!

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం నాడు ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. దాదాపు ఏడాది తర్వాత.. ముఖ్యమంత్రి , ప్రధానిని కలిశారు.  ఇన్నాళ్లూ తనని దూరం పెట్టిన ప్రధానిని కలిసే అవకాశం వచ్చినందుకు ఆయన దానిని సద్వినియోగంచేసుకుని.… రాష్ట్రానికి కేంద్రంనుంచి ప్రయోజనాలను ఆశించాలని గానీ.. పక్కవాడి మీద పడి ఏడవడం ఎందుకు? తమ రాష్ట్రానికి కావాల్సిందేమిటో అడగకుండా.. తెలంగాణకు ఎక్కువ లబ్ధి జరిగిపోతున్నదంటూ విలపించడం ఆయనకు కరక్టేనా? అంటూ.. తెలంగాణ ప్రజలు చంద్రబాబునాయుడు మీద.. కత్తులు నూరుతున్నారు.

చంద్రబాబునాయుడు భేటీలో ప్రధానితో అనేక అంశాల గురించి చర్చించారు. సాధారణంగా.. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకోవడానికి నిధులు, అమరావతి నిర్మాణానికి నిధుల మీదనే సీఎం ఫోకస్ ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఆ రెండు విషయాలను కూడా ప్రస్తావించినప్పటికీ.. చంద్రబాబునాయుడు విభజన తర్వాత ఆర్థిక వనరుల పరంగా జరుగుతున్న అన్ని లోటు పాట్లను ప్రస్తావించారు. చట్టం ప్రకారం తమకు రావాల్సింది ఏమిటో అడగడంతో పరిమితం కాకుండా.. ప్రతి చిన్న విషయంలోనూ తెలంగాణతో పోల్చుకుంటూ.. వారికి ఎక్కువ లబ్ధి జరిగింది.. తమకు తక్కువ లబ్ధి జరిగింది... అంటూ.. తెలంగాణను చూసి అసూయ చెందడం కరెక్టు కాదని తెలంగాణ మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు.

తెలంగాణ ఏ లాభం జరిగినా సరే.. ప్రతి విషయమూ కూడా విభజన చట్టానికి అనుగుణంగానే జరిగింది కదా.. ఏదో తాము దోచేసుకున్నట్లుగా చంద్రబాబు మాట్లాడడం కరెక్టు కాదనే వాదన వారిలో వినిపిస్తోంది. తెలంగాణను దోచుకున్నంత కాలం దోచుకున్నారని.. ఇప్పుడు మిగులు బడ్జెట్ తో స్థిరమైన పురోగతి వైపు విభజన తర్వాత తమ రాష్ట్రం పయనిస్తోంటే.. చంద్రబాబు చూసి ఓర్వ లేకపోతున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి.

కేంద్రంనుంచి తమ రాష్ట్రానికి కావాల్సిందేమిటో ఆయన నిరభ్యంతరంగా అడిగి పుచ్చుకోవచ్చు.. అంతే తప్ప.. మాకు దక్కుతున్న దాన్ని చూపించి తప్పులెన్నడం ఎందుకు.. భాజపాకు ఆయన మిత్రపక్షమే తప్ప.. మేంద కాదు కదా.. అనుచిత లబ్ధి అయితే గియితే ఆయనకే జరగాలి తప్ప మాకు జరగదు   కదా.. అని కూడా తెలంగాణ నాయకులు అంటున్నారు. మొత్తానికి ప్రతి అంశంలోనూ తెలంగాణమీద నిందలు వేస్తున్నట్లుగా.. చంద్రబాబు మోడీ తో విభజన చట్టం గురించిన లోపాలను ప్రస్తావించడం అనేది ఆ రాష్ట్ర ప్రజల్లో ఆయన పట్ల ఆగ్రహాన్ని కలిగిస్తోంది.