Advertisement


Home > Politics - Gossip
వామ్మో.. వెంకయ్యకు ఇంత ఖరీదైన ఫ్యాన్స్ ఉన్నారా..!

తెలుగు పత్రికల్లో ఫస్ట్ పేజీ యాడ్ అంటే అది మామూలు విషయం కాదు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు అంత పోసి ఫస్ట్ పేజీ యాడ్ ఇవ్వాలంటే ఒకసారి ఆలోచిస్తాయి. తమ పత్రికను అచ్చేసే ప్రతి సెంటర్ నుంచి కూడా ఫస్ట్ పేజీలో యాడ్ ను ప్రచురించాలంటే పత్రికలు యాడ్ ఇచ్చే వారి ఆస్తులు అడిగేస్తాయి. ఆంధ్ర, తెలంగాణ ఎడిషన్లతో పాటు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై గట్రా అన్ని ఎడిషన్లలోనూ తెలుగు పత్రికల్లో ఈ రోజు ఒక ప్రముఖమైన యాడ్ వచ్చింది.

ఫస్ట్ పేజీ అంతా ఆక్రమించేసింది. ఒక పత్రిక అని కాదు.. ఈనాడు, ఆంధ్రజ్యోతి.. ఈ రెండు పత్రికల ఫస్ట్ పేజీల్లోనూ ఫస్ట్ పేజీ ఒకటే యాడ్. అది వెంకయ్య నాయుడికి శుభాకంక్షలు చెబుతూ ప్రచురితమైనది. ఈ రోజు వెంకయ్య ఉప రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఈ యాడ్ ప్రచురితం అయ్యింది. మరి దీన్ని ఇచ్చిందెవరంటే.. వెంకయ్య అభిమానులు. ఈ రెండు పత్రికలకూ ఫస్ట్ పేజీ లో యాడ్ ఇచ్చి, సాక్షికి ఆఖరి పేజీలో యాడ్ ఇచ్చారు.

ఇవ్వకపోతే బాగుండదన్నట్టుగా జగన్ పత్రికకు ఇచ్చినట్టున్నారు. ఈనాడుకు ఫస్ట్ పేజీ తోపాటు కవర్ బ్యాక్ పేజ్ లో కూడా వెంకయ్యకు శుభాకాంక్షలే ఉన్నాయి. అదో ఫుల్ పేజీ యాడ్. జ్యోతికి కూడా అంతే. మరి కొన్ని కోట్ల రూపాయలను ఖర్చు పెట్టుకుని ఇలా పేపర్ యాడ్స్ ఇచ్చే ఫ్యాన్స్ ఉన్నారా? వెంకయ్య నాయుడికి? అనే సందేహమే జనిస్తోందిప్పుడు.

తను పైసా సంపాదించుకోలేదని వెంకయ్యనాయుడు ప్రకటించారు. రాజకీయాల్లో దశాబ్దాల పాటు ఉన్నా డబ్బు సంపాదన లేదని ఆయన అన్నారు. ఆ మరుసటి రోజే ఇలా కోట్లు పోసి వెంకయ్యకు శుభాకాంక్షలు తెలిపారు ఫ్యాన్స్. మరి వెంకయ్య నిరుపేదే అయినా.. ఆయన సంపాదించుకోకపోయినా.. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి శుభాకాంక్షలు తెలపగల ఫ్యాన్స్ ను వెంకయ్య సంపాదించుకున్నట్టుగా ఉన్నారనే విషయం మాత్రం స్పష్టం అవుతోంది.